Begin typing your search above and press return to search.
వచ్చిందే పిల్ల.. రౌడీ బేబిలను మించేలా మరోటి?
By: Tupaki Desk | 17 July 2020 5:45 AM GMTఫిదా చిత్రంలోని `వచ్చిందే పిల్ల..` సాంగ్ సెన్సేషన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. రౌడీ పిల్ల సాయి పల్లవి మాయ అంతగా పని చేసింది. యూట్యూబ్ లో రికార్డులు బద్ధలు కొట్టిన ఈపాటకు వేరొకటి సాటి లేదు. ఆ తర్వాత కూడా ధనుష్ సరసన రౌడీ బేబి సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్సింగ్ విన్యాసాలకు యూట్యూబ్ షేక్ అయ్యింది. ఆ రెండు పాటల తర్వాత మళ్లీ అలాంటిది ఒకటి కావాలని ఫ్యాన్స్ కోరుకోవడం సహజం.
మరి ఆ లోటు తీరుస్తూ తాజా చిత్రం `లవ్ స్టోరీ`లో సాయి పల్లవి ఇంకేదైనా చూపిస్తుందా? ఆ రేంజులో ల్యాండ్ మార్క్ స్టెప్పులతో సాంగ్ ఏదైనా ప్లాన్ చేశారా? అంటే.. అవుననే చెబుతున్నారు. సాయి పల్లవి గొప్ప నృత్యకారిణి. డ్యాన్సింగ్ క్వీన్ .. తనవైన స్టెప్స్ లో మిరాకిల్స్ చేయగలదు. డ్యాన్సుల్లో తనను ఎవరూ సరిపోలలేరు. ఢీ విన్నర్ గా కొరియోగ్రాఫర్ గా సత్తా చాటిన సాయి పల్లవి కథానాయికగా రాణించడం వెనక ట్యాలెంట్ ఎంతో. అందుకే అందరిలో ఆమె అంటే అంత బలమైన నమ్మకం.
సాయి పల్లవి రేంజుకు తగ్గట్టే కమ్ముల `లవ్ స్టోరీ`లో అలాంటి నంబర్ ఒకటి ప్లాన్ చేశారట. పైగా ఈ చిత్రంలో సాయి పల్లవి నర్తకి గా నటిస్తోంది. నాగచైతన్య నైజాం కుర్రాడిగా కనిపిస్తుండగా అతడి సరసన కొంటె పిల్లగా సాయి పల్లవి మ్యాజిక్ బాగానే వర్కవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ మూవీలో కథానుసారం వచ్చే పాటలతో పాటు సాయిపల్లవిపై ఒక పాట చాలా ప్రత్యేకంగా ఉండాలని కమ్ముల కోరుకున్నారట. అంతేకాదు ఈ పాటకు సాయి పల్లవినే స్వయంగా కొరియోగ్రాఫ్ చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కాకుండా దిల్ రాజు సైతం తన సినిమాలకు సాయిపల్లవితో కొరియోగ్రఫీ చేయించుకునే ఆలోచన లో ఉన్నారని ప్రచారం సాగుతున్న సంగతి విధితమే. దటీజ్ సాయిపల్లవి.