Begin typing your search above and press return to search.
యువ హీరో వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఎవరికీ తెలియడం లేదే..!
By: Tupaki Desk | 26 Nov 2020 4:30 AM GMTసీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆది. ఫస్ట్ సినిమా 'ప్రేమ కావాలి' లో డ్యాన్సులు ఫైట్స్ తో అలరించి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 'లవ్లీ' సినిమాతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఆది సాయి కుమార్ నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదు. 'సుకుమారుడు' 'రఫ్' 'గాలిపటం' 'ప్యార్ మే పడిపోయానే' 'శమంతకమణి' 'జోడి' 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' వంటి సినిమాల్లో నటించాడు ఆది. వీటిలో 'శమంతకమణి' తప్ప మరో సినిమా వచ్చినట్లు ఆడియన్స్ కి గుర్తు కూడా లేదు. అయితే వరుస ప్లాప్స్ వచ్చినప్పటికీ కూడా ఆది వాటిని పట్టించుకోకుండా సినిమాలని చేసుకుంటూ పోతున్నాడు. కాకపోతే ఆది సాయి కుమార్ సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ, అవి ఎవరికీ పెద్దగా తెలియడం లేదనే టాక్ నడుస్తోంది.
ఆది చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు దాకా ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఈ సంగతి సినీ అభిమానులకు తెలీదు. ఏ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడో లేదో ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడో తప్పిస్తే ఆది సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ "జంగిల్" ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయింది. హారర్ జోనర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ - విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా - ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్ మరియు అర్చనా చందా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో 'శశి' అనే సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు జి.బి.కృష్ణ దర్శకత్వంలో ఓ సస్పెన్ థ్రిల్లర్ చేస్తున్నాడని సమాచారం. మరి ఈ సినిమాతో విజయాలు అందుకుని ఆది సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.