Begin typing your search above and press return to search.
60 కోట్ల బడ్జెట్టా.. మనోజ్ కి అంత సీనుందా?
By: Tupaki Desk | 22 Feb 2020 6:30 AM GMTమంచు మనోజ్ కంబ్యాక్ మూవీ `అహం బ్రహ్మాస్మి` ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. మనోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి అందులో తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు- తమిళం- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడట. పాన్ ఇండియా వెల్లువలో మనోజ్ లోనూ జాతీయ స్థాయిలో పాపులర్ అవ్వాలన్న ప్రయత్నం కనిపిస్తోందట.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. తమిళ యాంకర్ భవానీ శంకర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. టాలీవుడ్ కోలీవుడ్ లో ఈ భామకు ఇదే డెబ్యూ మూవీ. ఇతర వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. అయితే ఈలోగానే మనోజ్ కథా నాయకుడిగా దాదాపు 60కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మించనున్నానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రకటించడం వేడెక్కిస్తోంది.
మహాశివరాత్రిని పురస్కరించుకుని మంచు మోహన్ బాబు శ్రీకాకుళం శ్రీకాళహస్తీశ్వరుని సమక్షం లో ఈ ప్రాజెక్టు కు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. త్వరలో మనోజ్ తో రూ.60 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రం నిర్మించనున్నామని.. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. ఇలా దైవ సన్నధిలో కుమారుడి సినిమా విశేషాలను చెప్పడం ఎంతో సంతోషం గా ఉందన్నారు. అయితే ఎంబీ కార్పోరేషన్ లోనే ఈ సినిమాని తీస్తారా? అన్నది ఆయన వెల్లడించాల్సి ఉంది. మనోజ్ కంబ్యాక్ మూవీ అతడి సొంత బ్యానర్ లో తీస్తున్నాడు కాబట్టి ఎంబీ కార్పొరేషన్ మూవీ వేరేగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో 30 కోట్ల రేంజు బడ్జెట్ సినిమాలనే నిర్మించారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ బడ్జెట్ల రేంజు.. మార్కెట్ రేంజ్ అమాంతం పదింతలయ్యాయి కాబట్టి మంచు ఫ్యామిలీ కూడా సాహసాలకు తెర తీసారని భావించాల్సి వస్తోంది.
అయితే హీరో మార్కెట్ ని బట్టి బడ్జెట్ ని వెచ్చించాల్సి ఉంటుంది. అలా కాకుండా మనోజ్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేయనున్నామని మోహన్ బాబు ప్రకటించడం ప్రస్తుతం పరిశ్రమలో చర్చకు వచ్చింది. మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. మార్కెట్ పూర్తిగా డైలమా లో ఉన్న ఈ టైమ్ లో ఆయన అంత సాహసం చేస్తున్నారా? అంటూ హాట్ డిబేట్ రన్ అవుతోంది.