Begin typing your search above and press return to search.

క్రికెట‌ర్ న‌టన‌ లోకి.. చియాన్ చ‌లువే!

By:  Tupaki Desk   |   26 Dec 2019 9:45 AM GMT
క్రికెట‌ర్ న‌టన‌ లోకి.. చియాన్ చ‌లువే!
X
క్రికెట‌ర్లు న‌ట‌న‌లోకి రావ‌డం అన్న‌ది కొత్తేమీ కాదు. అప్ప‌ట్లో టీమిండియా ఫించ్ హిట్ట‌ర్ అజ‌య్ జ‌డేజా న‌టుడిగా ముఖానికి రంగేసుకున్నాడు. ఖేల్- ప‌ల్ ప‌ల్ దిల్ కే సాత్ అనే రెండు చిత్రాల్లో న‌టించారు. స‌లీల్ అంకోలా- సునీల్ గ‌వాస్క‌ర్- వినోద్ కాంబ్లీ- మోహ్సిన్ ఖాన్- స‌లీమ్ దురానీ వంటి క్రికెట‌ర్లు న‌ట‌న‌లోనూ ల‌క్ చెక్ చేసుకున్నారు.

ఇటీవ‌లే టీమిండియా యువ ఫేస‌ర్ శ్రీ‌శాంత్ సైతం న‌ట‌న‌ లో ప్ర‌వేశించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన త‌ర్వాత అత‌డు సినిమా- రాజ‌కీయం అంటూ జోడుగుర్రాల‌పై ప‌రిగెత్తాడు. గ్లామ‌ర్ ఫీల్డ్ పై ఆసక్తితో ఓ సినిమాలోనూ న‌టించాడు. `టీమ్ 5` అనే బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో శ్రీ‌శాంత్ న‌టించాడు.

ఇప్పుడు టీమిండియా ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ న‌టుడి గా ల‌క్ చేసుకోబోతున్నాడు. ఇర్ఫాన్ మంచి బ్యాట్స్ మ‌న్.. పైగా ఫేస్ బౌల‌ర్ గా రాణించాడు. ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం తో టీమిండియా కు చ‌క్క‌ని విజ‌యాల్ని అందించిన ఘ‌నుడు. ఇప్పుడు చియాన్ విక్ర‌మ్ న‌టిస్తున్న 58వ సినిమా కోబ్రా తో న‌ట‌న‌లో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇందులో అత‌డు ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీ‌నిధి క‌థానాయిక కాగా ద‌ర్శ‌కుడు కే.ఎస్.ర‌వికుమార్ ఓ ముఖ్య‌ పాత్ర‌ లో న‌టిస్తున్నారు. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వం వ‌హిస్తున్నారు. తాజాగా రిలీజైన టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఓ థ్రిల్లర్ కథాంశంతో తెర‌కెక్కుతున్న చిత్రం. ఇందులో విక్ర‌మ్ 25 పాత్రల్లో కనిపించబోతున్నారు. 7 స్క్రీన్ స్టూడియో నిర్మిస్తుండ‌గా.. ఆస్కార్ విజేత‌ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది.