Begin typing your search above and press return to search.
తెలుగు తెరకి దొరికిన బహుమతి ... భానుమతి
By: Tupaki Desk | 7 Sep 2021 3:30 PM GMTతెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి కథానాయికలలో భానుమతి ఒకరు. చక్కని కనుముక్కుతీరుతో పాటు అంతకు మించిన తీయని స్వరం ఉండటం ఆమె ప్రత్యేకత. ఆకర్షణీయమైన కళ్లతో నవరసాలను ఆమె నాట్యం చేయించారు. తెలుగు పాటకు తేనె తాగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పరిథిలోని 'దొడ్డివరం' గ్రామంలో ఆమె జన్మించారు. సంగీతం నేపథ్యంగా గల కుటుంబంలో జన్మించడం వలన సహజంగానే ఆమె స్వరం .. స్వరాలు నేర్చింది. అలాగే విశాలమైన ఆమె కళ్లు అభినయం పట్ల ఆసక్తిని చూపించాయి.
అలా నటన పట్ల గల ఆసక్తితో నాటకాలు వేస్తూ వెళుతున్న భానుమతి, 'వరవిక్రయం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. మొదటి నుంచి కూడా భానుమతిలో చురుకుదనం .. చలాకీదనం ఎక్కువ. ఏదో కోల్పోయినట్టుగా దిగాలుగా కూర్చోవడం ఆమెకి తెలియదు. ఎప్పుడూ ఏదో ఒక పనిని చకచకా చేస్తూ ఉండేవారు. తనకి ఏ పాత్ర ఇచ్చినా ఎంతో అవలీలగా చేస్తూ వెళ్లేవారు. దాంతో ఇండస్ట్రీలో భానుమతి పేరు మారుమ్రోగడం మొదలైంది. తన ఎదురుగా ఉన్నది ఎంతటి స్టార్ అయినా, వాళ్లను డామినేట్ చేస్తూ నటించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.
భానుమతి ఒక వైపున సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఆధునిక భావాలను ఆవిష్కరిస్తూ ఉండేవారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని .. తన అభిప్రాయాన్ని మార్చుకోవడం ఆమెకి తెలియదు. తన ప్రేమ పెళ్లితో ఈ విషయం అందరికీ అర్థమైంది. తన ప్రేమను గెలిపించుకోవడానికిగాను పేదరికంతో పోరాడిన వ్యక్తిత్వం భానుమతి సొంతం. చివరివరకూ ఆ బంధం అందంగా .. ఆదర్శంగా నిలిచింది. అలాగే చిన్నపాటి మిస్ కమ్యూనికేషన్ కారణంగా 'మిస్సమ్మ' సినిమా నుంచి తప్పుకోవడం ఆమె ఆత్మాభిమానానికి నిదర్శనం. ఇక తన సినిమాల్లో తన పాత్రకి తను పాడవలసిందే. అలా అయితేనే ఆమె ఆ పాత్రలు చేయడానికి అంగీకరించేవారు.
భానుమతి ఎప్పుడూ .. ఏ పరిస్థితుల్లోను తన వ్యక్తిత్వానికి భిన్నంగా నడుచుకోలేదు. అందరి దగ్గర కాస్త తగ్గి ఉంటేనే నాలుగు అవకాశాలు వస్తాయన్నట్టుగా ఆమె ఎప్పుడూ వ్యవహరించలేదు. అవకాశాల కోసం అడిగింది లేదు. అయినా ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వెళ్లడానికి కారణం ఆమె అందం .. అభినయం .. క్రమశిక్షణ అనే చెప్పాలి. పాత్రలో ఆమె ఒదిగిపోయే తీరుకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టేవారు. స్వర్గసీమ .. మల్లీశ్వరి .. విప్రనారాయణ .. అంతస్తులు .. సారంగధర వంటి సినిమాలు ఆమె నటనకు కొండంత కొలమానంగా నిలుస్తాయి.
కథానాయికగా ఒక ఊపు ఊపేసిన భానుమతి, ఆ తరువాత కూడా తన పాత్రను ప్రధానంగా చేసుకుని నడిచే కథల్లోనే కనిపించారు. మంగమ్మగారి మనవడు .. ముద్దుల మనవరాలు ... బామ్మమాట బంగారు బాట .. పెద్దరికం సినిమాలలో నటించారు. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. అందాల భామ పాత్రల్లోనే కాదు, అనురాగం నిండిన బామ్మ పాత్రల్లోను తనదే పైచేయి అని ఆమె నిరూపించుకున్నారు. కేవలం నటిగా .. గాయనిగా మాత్రమే కాదు, దర్శక నిర్మాతగా కూడా ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు.
తన కుమారుడు 'భరణి' పేరుతో భరణి స్టూడియోస్ ను స్థాపించిన ఆమె, ఆ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అభిరుచి కలిగిన కథలను దర్శకురాలిగా తెరకెక్కించారు. ఇక సంగీత జ్ఞానం ఉండటం వలన కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వాన్ని కూడా వహించారు. ఆమె మంచి రచయిత్రి అనే విషయం తెలిసిందే. ఆమె రచించిన 'అత్తగారి కథలు'కు తెలుగు సాహిత్యంలో ఉన్నతమైన స్థానం లభించింది. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా భానుమతి అందరి హృదయాలను గెలుచుకున్నారు. పద్మశ్రీ .. పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఈ రోజున భానుమతి జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆమెను స్మరించుకుందాం.