Begin typing your search above and press return to search.

ఈ వయ్యారి హొయలతో కూడా హోలీ ఆడేసిందిగా..!!

By:  Tupaki Desk   |   29 March 2021 10:30 AM GMT
ఈ వయ్యారి హొయలతో కూడా హోలీ ఆడేసిందిగా..!!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రభామల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కానీ అందులో తెలుగు అమ్మాయిలు లేకపోవడం గమనార్హం. ఈరోజుల్లో డెబ్యూ హీరోయిన్స్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా హోలీ ఫెస్టివల్ రావడంతో యంగ్ హీరోయిన్స్ సెలెబ్రేషన్స్ లో బాగానే మునిగిపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హోలీ ఫెస్టివల్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలతో సందడి చేస్తున్నారు సెలబ్రిటీలు. తాజాగా యంగ్ బ్యూటీ కేతికశర్మ.. ఇంస్టాగ్రామ్ వేదికగా హోలీ ఆడిన పిక్స్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో కేతిక చాలా హుషారుగా కనిపిస్తుంది. అలాగే ఒంతినిండా కలర్స్ చల్లుకొని ఉంది. చూస్తుంటే హోలీని బాగా సెలెబ్రేట్ చేసుకున్నట్లుగా ఉంది.

ఇప్పటికే కేతికకు స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన ఫీచర్స్ అన్ని ఉన్నాయని.. అలాగే అమ్మడు తలచుకుంటే అద్భుతమైన గ్లామర్ షో కూడా చేయగలదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. త్వరలోనే కేతిక.. రొమాంటిక్ అనే సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేయనుంది. ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్ చూస్తే అర్ధమవుతుంది ఎంత రొమాంటిక్ క్యారెక్టర్ పోషించింది అనేది. నిజానికి రొమాంటిక్ సినిమాలో టాప్ లెస్ సీన్స్ కూడా చేసినట్లు టాక్ నడుస్తుంది. ఈ సినిమాతో పాటు నాగశౌర్య సరసన లక్ష్య సినిమాలో కూడా నటిస్తోంది. విడుదలకు దగ్గరపడిన ఈ సినిమా రిలీజ్ అయితే అమ్మడికి అవకాశాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం కేతిక ఇంస్టా పిక్ వైరల్ అవుతోంది. అమ్మడు టాప్ టు బాటమ్ కలర్స్ తో హోలీ ఆడుతోంది. ప్రస్తుతం వయ్యారి అందాలు చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.