Begin typing your search above and press return to search.

'రొమాంటిక్‌' బ్యూటీకి ఎన్టీఆర్‌30లో ఛాన్స్‌

By:  Tupaki Desk   |   19 Nov 2020 6:30 AM GMT
రొమాంటిక్‌ బ్యూటీకి ఎన్టీఆర్‌30లో ఛాన్స్‌
X
ఆకాష్‌ పూరి హీరోగా నటించిన రొమాంటిక్‌ సినిమాలో హీరోయిన్‌ గా కేతికా శర్మ మొదటి సినిమా విడుదల కాకుండానే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. రొమాంటిక్‌ సినిమా పోస్టర్స్‌ మరియు టీజర్‌ చూసిన తర్వత అమ్మడికి వరుసగా అవకాశాలు వెళ్లువెత్తుతున్నాయి. ఈమెకు ఏకంగా స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ నుండి పిలుపు వచ్చినట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. త్రివిక్రమ్‌ మార్చి నుండి ఎన్టీఆర్‌ 30 సినిమాను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన త్రివిక్రమ్‌ హీరోయిన్‌ గా కేతికా శర్మ ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నాడట.

ఎన్టీఆర్‌ కు జోడీగా ఈమె బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడట. ఈ విషయంలో త్రివిక్రమ్‌ నిర్ణయాన్ని పూర్తిగా ఎన్టీఆర్‌ సమర్థిస్తాడు. ఎందుకంటే హీరోయిన్స్‌ ఎంపిక విషయంలో ఆయన జడ్జ్ మెంట్‌ ఇప్పటి వరకు తప్పలేదు. అందుకే ఎన్టీఆర్‌ 30 లో కేతికా శర్మ ఎంపిక అనేది సరైన నిర్ణయమే అనే అభిప్రాయం నందమూరి అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ 30 సినిమాలో కేతికా నటించబోతున్నట్లుగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడంతో పాటు ఆహా ఓటీటీ కోసం అల్లు అర్జున్‌ తో కలిసి ఒక కమర్షియల్‌ లో కూడా నటించింది.

ఆహా యాడ్‌ కు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో కేతికా ను పరిశీలించిన త్రివిక్రమ్‌ తదుపరి సినిమా హీరోయిన్‌ గా ఫిక్స్‌ చేసుకుని ఉంటాడు అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ కోసం ఈ అమ్మడిని ఎంపిక చేయడం వల్ల ఖచ్చితంగా ఈమెకు స్టార్‌ డం దక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ తో ఇప్పటికే త్రివిక్రమ్‌ సినిమాను చేశాడు. ఆ సినిమా నిరాశ పర్చింది. దాంతో ఇప్పుడు మరో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రాధాకృష్ణతో కలిసి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్నాడు.