Begin typing your search above and press return to search.

తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు పబ్లిక్ గా ఇలా కనిపించారు!

By:  Tupaki Desk   |   15 March 2022 7:44 AM GMT
తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు పబ్లిక్ గా ఇలా కనిపించారు!
X
తిరుమల శ్రీవారి సేవలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తరించింది. మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.

జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలు, భార్యను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతారు. వారి ఫొటోలు తరుచుగా బయటకు రావు. ఈ క్రమంలోనే తిరుమలకు ఎన్టీఆర్ కుమారులు ఇద్దరూ రావడంతో వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఎన్టీఆర్ మినహా మిగతా కుటుంబ సభ్యులు కనిపించారు. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్, రాంచరణ్ ఇందులో మల్టీ స్టారర్ లుగా నటించారు.

కాగా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉండడం వల్లే రాలేదని తెలుస్తోంది. ఆయన కుటుంబం మాత్రం హాజరైంది. అధికార వైసీపీకి చెందిన కొందరు నేతలు , టీటీడీ అధికారులు వీరికి దగ్గరుండి దర్శనం ఇతర సౌకర్యాలు కల్పించారు.