Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆర్జీవీ అప్స‌ర టూమ‌చ్ హాట్

By:  Tupaki Desk   |   7 July 2020 4:00 AM GMT
ఫోటో స్టోరి: ఆర్జీవీ అప్స‌ర టూమ‌చ్ హాట్
X
చేప క‌ళ్లు.. సూదంటు ముక్కు.. విల్లులా వొంగిన‌ దోర దొండ పెద‌వులు.. రింగు రింగుల జుత్తు.. ఎవ‌రీ అప్స‌ర‌.. ఎవ‌రీ ర‌సిక ‌రాణి? ఇంద్ర‌లోకం నుంచి దిగొచ్చిన దేవ‌క‌న్య‌నా? రంభ‌.. మేన‌క‌.. ఊర్వ‌శి తాలూకానా? ఇంత‌కీ ఎవ‌రీవిడ‌?

ఆర్జీవీ లేటెస్ట్ డిస్క‌వ‌రీ ఈవిడ‌. అస‌లు ఆర్జీవీ సెలెక్ష‌న్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ది గ్రేట్ ఊర్మిల మ‌ఠోండ్క‌ర్ ని రంగీలాగా వేడెక్కించే పాత్ర‌లో ఆవిష్క‌రించినా.. క్ష‌ణ‌క్ష‌ణంలో శ్రీ‌దేవిని అభిన‌య నేత్రిగా ఆవిష్క‌రించినా వ‌ర్మ‌కే చెల్లింది. న‌థాలియా కౌర్... అనైక శోథి లాంటి వేడెక్కించే అందాల్ని వెతికి ప‌ట్టుకున్నా ఆర్జీవీకి ఉన్న అభిరుచి పొగ‌రు ఒగ‌రు చూపించే కుర్రాళ్ల అభిరుచి ఒక‌టేన‌ని ప్రూవైంది.

శృంగార తార మియా మ‌ల్కోవాని వెతికి వెంటాడి జీఎస్టీ లాంటి సినిమాకి ఒప్పించిన‌ప్పుడే వ‌ర్మ ప‌నిత‌నం గురించి ప్ర‌పంచానికి మ‌రోసారి అర్థ‌మైంది. ఆమెతోనే ఆర్జీవీ క్లైమాక్స్ లాంటి థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించినా ఆయ‌న శైలి వేరు అని ప్రూవైంది. న‌గ్నం అంటూ కాస్ట్యూమ్ డిజైన‌ర్ కం బెజ‌వాడ బ్యూటీ శ్రీ రాపాక‌ను నెవ్వ‌ర్ బిఫోర్ యాంగిల్ లో చూపించిన ఘ‌నుడిగానూ వ‌ర్మ‌ను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు.

ఇప్పుడు అప్స‌ర రాణి వంతు. ఒడిశాకు చెందిన అప్సర రాణిని తన కొత్త సినిమా హీరోయిన్ గా ఎంపిక చేసుకుని మ‌రోసారి త‌న సెలెక్ష‌న్ సంథింగ్ స్పైసీ అని ప్రూవ్ చేస్తున్నాడు. శ్రీ రాపాకను ఓవర్ నైట్ సెలబ్రెటీగా మ‌లిచిన వ‌ర్మ ఇప్పుడు అప్స‌ర బాధ్య‌త‌ను తీసుకున్నాడు. ఫోటోషూట్ల‌తోనే స‌గం గుబులు పెంచే వ‌ర్మ అప్స‌ర‌లోని అన్ని కోణాల్ని య‌మ రంజుగానే ఫోటోల్లో ఆవిష్క‌రించాడు. ఆర్జీవీ మార్క్ యాంగిల్స్ కి స‌రిప‌డా అందాల‌న్నీ అప్స‌ర‌లో కుప్ప పోసిన‌ట్టుగా ఉన్నాయ‌ని చెబితే త‌ప్పేమీ కాదు. అస‌లు ఇన్నాళ్లుగా ఈ అప్స‌ర ఎక్క‌డుందో ఎవ‌రికీ తెలీదు. ఇండస్ట్రీలో కూడా ఈమె చాలా మందికి తెలియనే తెలియదు. అలాంటి అప్సర వర్మ చేతిలో పడటంతో ద‌శ తిరిగిపోయింది అంటూ అప్పుడే సాటి నాయిక‌లు కుళ్లుకుంటున్నార‌ట‌. అస‌లింత‌కీ ఎవ‌రీ అప్స‌ర అంటూ గూగుల్ లో సెర్చ్ మొద‌లైంది.