Begin typing your search above and press return to search.

అందాల వేటగాళ్ల కోసమే..పుట్టిందేమో ఈ ఊర్వశి సౌందర్యం!

By:  Tupaki Desk   |   1 May 2020 5:30 PM GMT
అందాల వేటగాళ్ల కోసమే..పుట్టిందేమో ఈ ఊర్వశి సౌందర్యం!
X
సినిమా ఇండస్ట్రీలో అందమైన భామలకు.. అందాల దాచుకోకుండా ప్రదర్శించే వయ్యారి భామలకు కొదవే లేదు. కళ్ళతో కాకుండా కళాత్మకంగా చూసే హృదయులకు ఈ రంగుల ప్రపంచం ఎప్పుడూ అందమైనదే. కరోనా కాలం అయినా.. లాక్ డౌన్ అయినా కుర్రకారు అందాల వేట మాత్రం ఆపలేరు. అలా అందాలను వెతికే వారికోసమే ఈ అమ్మడు పుట్టిందా అనేంతలా ఉంటుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా. అందాల పోటీల్లో విజేతగా నిలిచి మోడలింగ్ లో రాణించి, ఆ తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది ఊర్వశి. అయితే ఇంతవరకు సినీరంగంలో ఇంకా ఆమె పొందాల్సిన గుర్తింపు పొందలేదు. ప్రత్యేక గీతాలు, స్పెషల్ క్యారెక్టర్లకే అమ్మడు పరిమితమవుతూ వస్తుంది.

ఈ సంగతి పక్కన పెడితే 25మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఊర్వశి అందాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లకు మాత్రం ఫేవరెట్ హీరోయిన్. ఎప్పటికప్పుడు తాజా తాజా ఫోటో షూట్లతో, ఫొటోలతో కుర్ర గుండెల్లో చిచ్చు పెట్టగలదు. అంతటి అందగత్తె మరి ఊర్వశి. ఇక తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ఫోటో షేర్ చేసింది. గులాబీ రంగు డ్రెస్ లో ఊర్వశి పాలరాతి శిల్పంలా అందాలను ఎర వేస్తూ అభిమానుల మతులు పోగొడుతుంది. తను కదలకుండా నిలబడి తన పోజుతో కుర్ర గుండెలను పరిగెత్తిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇంత అందాన్ని చూసాక కొంటె కుర్రాళ్లు ఆగుతారా తమదైన స్టైల్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.