Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి అమెరికా గుడ్ న్యూస్... వారికి మాత్రం నో ఛాన్స్!

అమెరికాలో శాస్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By:  Tupaki Desk   |   21 Sep 2024 8:30 PM GMT
గ్రీన్  కార్డ్  హోల్డర్స్ కి అమెరికా గుడ్  న్యూస్... వారికి మాత్రం నో ఛాన్స్!
X

అమెరికాలో శాస్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇది పర్మనెంట్ రెసిడెంట్ కార్డు హోల్డర్స్ కి మాత్రమే వర్తిస్తుంది తప్ప.. కండిషనల్ రెసిడెన్సీ తీసుకునే గ్రీన్ కార్డులకు ఇది వర్తించదు! ఏది ఏమైనా... పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించేలా యూఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది!

అవును... అమెరికాలో శాస్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డు హోల్డర్స్ కు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. వాస్తవానికి గతంలో గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ.. గ్రేస్ పిరియడ్ అన్నట్లుగా మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీని పొడిగించేవారు. అయితే ఇప్పుడు ఆ వ్యాలిడిటీని అక్కడి ప్రభుత్వం పొడిగించింది.

ఇందులో భాగంగా ఇప్పుడు గ్రీన్ కార్డు గడువు తీరినప్పటికీ దాని వ్యలిడిటీ 36 నెలలకు పెంచినట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూ.ఎస్.సీ.ఐ.ఎస్.) వెల్లడించింది. దీంతో... కొత్త కార్డుల కోసం వేచి చూసే వారు మరికొంతకాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాను కొనసాగించేందుకు వీలు లభించినట్లయ్యింది.

వాస్తవానికి యూఎస్ లో గ్రీన్ కార్డులు పొందినవారు ప్రతీ పదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేసుకొవాలి. దీనికోసం గడుపు తీరడానికి ఆరునెలల ముందే ఐ-90 ఫామ్ ను సబ్ మిట్ చేయాలి. అప్పుడు కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీస్ ఇస్తారు. దీంతో... గ్రీన్ కార్డు గడువు తీరిపోయినప్పటికీ... ఈ నోటీసును లీగల్ స్టేటస్ ప్రూఫ్ గా వినియోగించుకోవచ్చు.

ఈ క్రమంలోనే తాజాగా ఆ 24 నెలల వ్యాలిడిటీని 36 నెలలకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అయితే.. కండిషనల్ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్ కార్డుల గడువు రెండేళ్ల పాటే (24 నెలలు) ఉంటుంది.. వీరికి మాత్రం తాజా గడువు వర్తించదు.