Begin typing your search above and press return to search.

అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశిస్ కారణంగా వివక్ష ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులు..

అయితే అక్కడికి వెళ్లిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అంతకంత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   6 Oct 2024 4:21 AM GMT
అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశిస్ కారణంగా వివక్ష ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులు..
X

స్వదేశం నుంచి విదేశానికి చదువులకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే అక్కడికి వెళ్లిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అంతకంత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన సమస్యలు బయట దేశాల్లో చదువుకుంటున్న ఇండియన్ విద్యార్థుల కష్టాలను.. వారు ఎదుర్కొంటు సమస్యలను బహిర్గతం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యలు విదేశీయుల నుంచి రావడం లేదు.. స్వదేశం నుంచి ఎప్పుడో వెలిసే అక్కడే సెటిల్.. అక్కడ పుట్టి పెరిగిన అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశిస్.. అదేనండి మన ABCDల కారణంగా తలెత్తుతుంది.

యు ఎస్ లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు ఇదే విషయంపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇక్కడ వివక్ష ఎదుర్కొంటున్నామని.. అయితే అది పరదేశీయుల చేతిలో కాదు.. విదేశాలలో సెటిల్ అయినా ఫ్యామిలీ లకు సంబంధించిన పిల్లల కారణంగా అని వెల్లడించారు. అంతేకాదు మరొక విద్యార్థి తన ఫ్రెండుని అమెరికాలో స్థిరపడిన ఒక ప్రవాస భారతీయుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ వద్ద దుర్భాషలాడినట్టు పేర్కొన్నాడు.

విచిత్రం ఏమిటంటే ఆ విద్యార్థికి మద్దతుగా అమెరికన్ విద్యార్థులు రావడంతో ఆ ప్రవాస భారతీయుడు కాస్త శాంతించాడు.. దీంతో ఇప్పుడు ప్రవాస భారతీయ విద్యార్థులకు.. చదువు కోసం వెళ్తున్న భారతీయ విద్యార్థుల పట్ల ఎందుకు విముఖత ఉంది అన్న విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది చాలావరకు ఏర్పడుతున్న కల్చరల్ డిఫరెన్స్ కారణంగా అని అందరూ భావిస్తున్నారు.

స్వతహాగా భారతీయులైనప్పటికీ విదేశాలలో పుట్టి పెరగడం వల్ల వాళ్ళ జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఇటు భారతీయతను.. అటు విదేశీ జీవనశైలిని బ్యాలెన్స్ చేయలేక పిల్లలు ఇలా తయారవుతున్నారని కొందరు భావిస్తున్నారు. విదేశాలలో మమేకం అవ్వడానికి వారు ఎన్నో విధాలుగా తమ నీ తాము మార్చుకుంటారు. ఈ క్రమంలో తమ సొంత దేశం నుంచి వచ్చిన విద్యార్థుల పట్ల వాళ్లకి ఓ డిటాచ్మెంట్ భావన ఏర్పడుతుంది.

అందుకే ప్రస్తుతం అమెరికాలో అక్కడే స్థిరపడిన కుటుంబాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయ విద్యార్థులకు.. చదువు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు మధ్య తీవ్రమైన వ్యత్యాసాన్ని వ్యక్తం అయ్యేలా చేస్తుంది. అందుకే ఈ రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు.. అభిప్రాయ భేదాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తోంది. అయితే వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.