Begin typing your search above and press return to search.

ఇండియన్ స్టూడెంట్స్ ని వెనక్కి పంపేసిన అమెరికా... కారణం ఇదే!

ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:38 AM GMT
ఇండియన్ స్టూడెంట్స్ ని వెనక్కి పంపేసిన అమెరికా... కారణం ఇదే!
X

ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. అగ్రరాజ్యంలో అభ్యసించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో ఇండియాలో యూఎస్ ఫ్లైట్ ఎక్కిన విద్యార్థులను అమెరికా అధికారులు రిటన్ ఫ్లైట్ ఎక్కించేశారు. వీరిలో 21మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు!

అవును... అమెరికాకు వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. వివిధ యూనివర్శిటీల్లోని కోర్సుల్లో చేరేందుకు వెళ్లిన వారిని అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు ఆపేశారు. అనంతరం అట్లాంటా, శాన్‌ ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్‌ పోర్ట్‌ ల నుంచి రిటర్న్‌ ఫ్లైట్‌ లు ఎక్కించారు.

విమానాశ్రయాలకు చేరుకున్నాక సాధారణ తనిఖీల్లో భాగంగా కొంతమందిపై అనుమానంతో అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు ఆరా తీశారు. వివిధ పత్రాలు సక్రమంగా లేకపోవడం వారు గమనించారని అంటున్నారు. వారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని సమాచారం.

అయితే ఈ సమయంలో ఎంట్రన్స్ లు దక్కిన వర్సిటీలో ఫీజులు, విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించారు. ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలు, అమెరికాలోని విద్యార్థులతో సంభాషణలను లోతుగా పరిశీలించారు. అనంతరం అవి సక్రమంగా లేకపోవడంతో వారిని తిప్పి పంపినట్లు తెలుస్తోంది.

కాగా... ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్‌ అయిన విద్యార్థులు తిరిగి ఆ దేశ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి 5 ఏళ్ల దాకా అనర్హులు అవుతారు.