వర్జీనియాలో 25 ఏళ్ల ఇండియన్ మిస్సింగ్... పోలీస్ వివరాలివే!
ఇటీవల కాలంలో అమెరికాలో ప్రమాదాల బారిన పడుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 May 2024 5:11 AM GMTఇటీవల కాలంలో అమెరికాలో ప్రమాదాల బారిన పడుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొంతమంది హాస్పటల్స్ లో చేరి ఇబ్బందులు పడుతుంటే.. మెజారిటీ జనం మాత్రం మృత్యువాతపడుతున్న పరిస్థితి. ఈ సమయంలో తాజాగా భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తికి సంబంధించిన బాధాకరమైన సంఘటన జరిగింది!
అవును.. ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో ప్రమాదాల బారిన పడుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా భారత సంతతికి చెందిన 25ఏళ్ల వ్యక్తి తప్పిపోయినట్లు రిపోర్ట్ చేయబడింది. దీంతో ఇతడి కోసం ఫెయిర్ ఫాక్స్ కౌంటీ పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మేరకు ఆన్ లైన్ వేదికగా తప్పిపోయిన భారతీయుడి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా... అతడి పేరు ఓం అరవింద్ కాగా.. అతది వయసు 25 ఏళ్లు అని తెలిపారు. మే 7వ తేదీ ఉదయం 11 గంటలకు మనస్సాస్ లోని సెంటర్ విల్లే రోడ్ 7200 బ్లాక్ నుండి బయలుదేరి వెళ్లాడు అని తెలిపారు.
ఇక అతని ఎత్తు 5 అడుగుల 5 అంగులాలు కాగా.. బరువు 120 పౌండ్లు అని తెలిపిన పోలీసులు... బ్లక్ హెయిర్, నీలం రంగు షర్ట్, టాన్ షార్ట్స్, బ్లాక్ షూస్ & గ్లాసెస్ ధరించాడని తెలిపారు. అతడు శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా తప్పిపోయి ఉంటాడని అంటున్నారు. ఆచూకి తెలిసిన వారు 703-691-2131కి కాల్ చేయాలని పోలీసులు తెలిపారు!