Begin typing your search above and press return to search.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

అమెరికాలో పలు రకాల ప్రమాదాల బారిన పడుతున్న విద్యార్థుల జాబితాలో ఇటీవల హైదరాబాద్ కు చెందిన విద్యార్థి చేరిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 March 2024 12:30 PM GMT
అమెరికాలో హైదరాబాద్  విద్యార్థి మిస్సింగ్  కేసులో బిగ్  ట్విస్ట్!
X

అమెరికాలో పలు రకాల ప్రమాదాల బారిన పడుతున్న విద్యార్థుల జాబితాలో ఇటీవల హైదరాబాద్ కు చెందిన విద్యార్థి చేరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న మహ్మద్ అబ్ధుల్ అర్ఫాత్ (25) మార్చి 8 నుంచి ఫ్యామిలీ మెంబర్స్ తో టచ్ లో లేడు. ఈ సమయంలో అతడి పేరెంట్స్ కి డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్ వచ్చిందని తెలుస్తుంది.

అవును... హైదరాబాద్ లోని మల్కాజిగిరీలో నివసిస్తున్న మహ్మద్ అబ్ధుల్ అర్ఫార్ తల్లితండ్రులకు తాజాగా డిమాండ్ కాల్ వచ్చింది. ఇందులో భాగంగా 12,000 డాలర్లు తమకు చెల్లించాలని, అలాకానిపక్షంలో తమ కుమారుడి కిడ్నీ అమ్మెస్తామని గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని తెలుస్తుంది. ఇదే క్రమంలో తమ కుమారుడు అదృశ్యమైన 10 రోజులకు ఒక వాట్సప్ మెసేజ్ కూడా వచ్చిందని అంటున్నారు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన అబ్దుల్ తండ్రి సలీం మాట్లాడుతూ... గత ఏడాది అమెరికా వెళ్లినప్పటినుంచీ తమ కుమారుడు బాగానే ఉన్నాడని.. ఈ క్రమంలో ఈ నెల 8న వీడియో కాల్ చేసి మాట్లాడాడని తెలిపారు. ఆ తర్వాత నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని తెలిపారు. ఈ క్రమంలో తన అన్న కొడుకు అక్కడే ఉండటంతో... అబ్దుల్ ఎలా ఉన్నాడో చూడమని అతడి రుం కి పంపిస్తే.. అప్పటికే అతడి రూం మెంట్స్ కూడా అబ్ధుల్ కనిపించడంలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పారని అన్నారు.

అబ్దుల్ ఆచూకిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించాలని అబ్దుల్ తండ్రి సలీం కోరారు. ఇదే సమయంలో అస్లీం యూఎస్ లోని తమ బంధువులకు సమాచారం అందించడంతో వారు క్లీవ్ ల్యాండ్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైట్ దాఖలు చేశారని.. దీంతో పోలీసులు వాచ్ ఆర్డర్ జారీ చేశారని తెలుస్తుంది. ఆ ఆర్డర్ కాపీ ప్రకారం... ఆర్ఫాత్ వైట్ టీ షర్ట్, రెడ్ కలర్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించాడని చెబుతున్నారు. కాగా... 2023 మేలో అర్ఫాత్ యూఎస్ కి వెళ్లాడు