Begin typing your search above and press return to search.

భారతీయులకు ఆస్ట్రేలియా బంపర్ ఆఫర్

అక్టోబరు ఒకటి నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలు పూర్తి అయ్యాయి.

By:  Tupaki Desk   |   27 Sep 2024 4:44 AM GMT
భారతీయులకు ఆస్ట్రేలియా బంపర్ ఆఫర్
X

ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకునే వారికి.. అక్కడ వర్కు చేయాలనుకునే వారికి బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది ఆ దేశం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం.. పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ఇరు దేశాల మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడేలా ఆ దేశం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. భారతీయులకు ఏటా వెయ్యి వర్క్.. హాలీడే వీసాల్ని జారీ చేసేందుకు కంగారు దేశం సిద్ధమైంది. ఇరుదేశాల మధ్య చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ వీసాల్ని జారీ చేయనున్నారు.

అక్టోబరు ఒకటి నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలు పూర్తి అయ్యాయి. ఇరుదేశాల మధ్య రాకపోకలు.. ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ నిర్ణయం సాయం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెప్టెంబరు 23 నుంచి 26 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజాగా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం గురించి వెల్లడించారు.

తాజాగా కుదిరిన ఒప్పందంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

- ఆస్ట్రేలియాలో ఉపాధి.. విద్య.. టూరిజం కోసం 12 నెలల పాటు ఉండేందుకు వీలుగా ఈ వీసా జారీ

- 18 -30 ఏళ్ల భారతీయ యువత ఈ వీసాలు అప్లై చేసుకోవటానికి అర్హత ఉంటుంది.

- ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లోని స్థానిక నిబంధనలకు లోబడి తాత్కాలికంగా ఉండేందుకు ఏటా వెయ్యి వీసాల జారీ