Begin typing your search above and press return to search.

నమ్మశక్యం కాని నిజం... అగ్ర రాజ్యంలో ఇది మినీ భారత్‌!

విదేశీ విద్య, ఉన్నతోద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Sep 2024 1:30 PM GMT
నమ్మశక్యం కాని నిజం... అగ్ర రాజ్యంలో ఇది మినీ భారత్‌!
X

విదేశీ విద్య, ఉన్నతోద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారతీయులు తమ డాలర్‌ డ్రీమ్స్‌ కు అమెరికాను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. మనదేశం నుంచి ఎక్కువ మంది వలస వెళ్తున్న దేశంగానూ అమెరికా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో అమెరికాలో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయులు ఆ తర్వాత శాశ్వత నివాసం సైతం పొందుతున్నారు. దీంతో అమెరికాలో కొన్ని ప్రాంతాలు మినీ భారత్‌ ను తలపిస్తున్నాయి.

ముఖ్యంగా అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కాలిఫోర్నియాలో భారతీయుల జనాభా భారీగా పెరుగుతుండటం విశేషం. కాలిఫోర్నియాలోనే వివిధ బహుళజాతి సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అలాగే కాల్‌ టెక్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయుల జనాభా కాలిఫోర్నియాలో భారీగా పెరుగుతోంది.

2013 నుండి 2023 వరకు కాలిఫోర్నియాలో భారతీయుల సంఖ్య 300,000 కంటే ఎక్కువ పెరిగింది. దీంతో కాలిఫోర్నియాలో వేగంగా పెరుగుతున్న సమూహాల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు.

2023 నాటికి కాలిఫోర్నియాలో 925,000 మంది భారతీయులు, భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా, ఇది 2013లో 620,000 నుండి దాదాపు 50% పెరగడం విశేషం, మరోవైపు మొత్తం మీద కాలిఫోర్నియా మొత్తం జనాభా కేవలం 2% మాత్రమే పెరగడం గమనార్హం. దీన్ని బట్టి కాలిఫోర్నియాలో భారతీయుల హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

శాన్‌ జోక్విన్, శాన్‌ ఫ్రాన్సిస్కో వంటి కౌంటీల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే బే ఏరియాల్లోనూ భారతీయ సంఘాలు పెరిగాయి.

భారతీయ వలసదారులను ఆకర్షిస్తున్న టెక్, బయోటెక్‌ పరిశ్రమలలో ఉద్యోగావకాశాల కారణంగా ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. జననాలు, అంతర్జాతీయ వలసలు కూడా జనాభా పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

డబ్లిన్, శాన్‌ రామన్‌ వంటి నగరాల వేగవంతమైన విస్తరణలో భారతీయ అమెరికన్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు, మంచి పాఠశాలలు, సురక్షితమైన పరిసరాలు, సిలికాన్‌ వ్యాలీకి సమీపంలో ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ భారతీయుల జనాభా పెరుగుతోంది.