Begin typing your search above and press return to search.

న్యూయార్క్ లో స్కూల్స్ కి దీపావళి సెలవు.. ఎంత మందికి బెనిఫిట్ అంటే?

చెడుపై మంచి సాధించిన విజయాన్ని.. చీకటిపై కాంతి పొందిన గెలుపునీ దీపాల వెలుతురుల్లో చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2024 11:36 AM GMT
న్యూయార్క్  లో స్కూల్స్  కి దీపావళి సెలవు.. ఎంత మందికి బెనిఫిట్  అంటే?
X

నేడు భారతదేశంలో దీపావళి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని.. చీకటిపై కాంతి పొందిన గెలుపునీ దీపాల వెలుతురుల్లో చేసుకుంటున్నారు. ఇక ఈ పండగకు పిల్లల సందడి గురించి చెప్పే పనే లేదు.

దీపావళికి స్కూల్స్ కి సెలవు ఇవ్వడంతో.. ఉదయం నుంచే అగ్గిపుల్లల దగ్గర నుంచి చిచ్చుబుడ్డీల వరకూ కాలుస్తూ మొదలుపెట్టేశారు. చీకటి పడిన తర్వాత బాణాసంచా కాల్చుకోవాలని ఇంట్లో కొంతమంది పెద్దవాళ్లు చెబుతున్నా.. ఒక్కసారి కమిట్ అయ్యాక తమ మాట తామే వినమని చెబుతూ సందడి కంటిన్యూ చేస్తున్నారు.

అయితే... ఈ స్కూల్స్ కి సెలవులు ఇవ్వడాలు, భారతదేశంలో ఉన్న పిల్లలకే కాదు సుమా... విదేశాల్లో ఉన్న విద్యార్థులకూ లక్ దక్కింది. వాళ్లు కూడా ఈ ఏడాది నుంచి దిపావళి రోజున స్కూల్స్ ప్రకటించే సెలవులను ఎంజాయ్ చేస్తూ.. దీపావళి సంబరాలు జరుపుకోనున్నారు.

అవును...ఈ సంవత్సరం దీపావళిని న్యూయార్ నగరం కూడా అధికారిక పాఠశాల సెలవు దినంగా గుర్తించింది! ఈ మేరకు గత ఏడాది గవర్నర్ కాథీ హోచుల్ సంతకం చేసిన చట్టాన్ని ఫాలో అవుతోంది. ఇందులో భాగంగా... నవంబర్ 1న న్యూయార్క్ నగరంలో సెలవు దినం అమలులోకి కాబోతోంది!

ఇది కచ్చితంగా చారిత్రాత్మక నిర్ణయం అనే చెప్పాలి. ఇక ఇలా దీపావళి పర్వదినాన్న్న సెలవు ప్రకటించడం వల్ల సుమారు 1.1 మిలియన్ల మంది విద్యార్థులు దీపాల పండుగను జరుపుకునేందుకు వీలవుతుందని అంటున్నారు. దీనిపై అంతర్జాతీయ వ్యవహారాల మేయర్ ఆఫీసు నుంచి దిలీప్ చౌహాన్ స్పందిస్తూ.. ఈ నిర్ణయం ఐక్యతను పెంపొదిస్తుందని అన్నారు.