అమెరికా అధ్యక్ష రేసులో ప్రవాస భారతీయుడు… సింగ్ విల్ బి కింగ్?
తాజాగా భారతీయ సంతతికి చెందిన యుఎస్ పౌరుడు హర్ష్ వర్ధన్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ అభ్యర్థి రేసులో హర్ష్ వర్ధన్ సింగ్ ఉన్నారు.
By: Tupaki Desk | 30 July 2023 7:01 AM GMTఇండియాలో ఎలాగైతే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడి సందడి నెలకొందో.. అదే విధంగా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేగంగా సమీపిస్తున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో కూడా అప్పుడే ఆ సందడి మొదలైంది. ఇందులో బహగంగా తాజాగా ఒక భరతీయ సంతతికి చెందిన వ్యక్తి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నీకలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు, ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ మరోసారి ఎన్నికలకు పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో... అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ పదవికి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ క్రమంలో తాజాగా భారతీయ సంతతికి చెందిన యుఎస్ పౌరుడు హర్ష్ వర్ధన్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ అభ్యర్థి రేసులో హర్ష్ వర్ధన్ సింగ్ ఉన్నారు. ఇంజినీర్ అయిన హర్ష్ వర్దన్ సింగ్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో 38 ఏళ్ల హర్ష్ వర్ధన్ సింగ్.. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి పదవిని కోరుతూ 3 నిమిషాల వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ప్రకటనలో... సింగ్ తనను తాను అమెరికా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ క్యారీ, ప్రో-లైఫ్ కన్జర్వేటివ్ గా పేర్కొన్నాడు. తాను జీవితాంతం రిపబ్లికన్ గా ఉన్నానని చెప్పాడు.
ఇదే సమయంలో 2017 నుంచి న్యూజెర్సీ రిపబ్లికన్ పార్టీ సంప్రదాయవాద విభాగాన్ని పునరుజ్జీవింపజేయడంలో సింగ్ తన పాత్రను హైలైట్ చేశాడు. ఇదే సమయంలో ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు... నిక్కీ హేలీ(51), వివేక్ రామస్వామి(37) ఈ బరిలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా రిపబ్లికన్ అభ్యర్థి రేసులోనే ఉన్నారు.
ఇలా ఈ ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. దీంతో అత్యున్నత పదవి కోసం రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం కన్ ఫాం అని తెలుస్తోంది. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్, ప్రెసిడెన్షియల్ నామినేటింగ్ కన్వెన్షన్ల శ్రేణి, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ అభ్యర్థిని ఖరారు చేయబోతోంది.
దీంతో... ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతి అమెరికన్లు రేసులో ముందంజలో ఉన్నారనే అనుకోవాలి. ఏది ఏమైనా... 2014 ఎన్నికల అనంతరం భారతీయ సంతతి వ్యక్తే అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.