Begin typing your search above and press return to search.

షాకింగ్ క్రైం... యూఎస్ లో 4గురు తెలుగువారు అరెస్ట్!

ఇటీవల కాలంలో అమెరికాలో వెలుగుచూస్తున్న తెలుగువారికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2024 5:41 AM GMT
షాకింగ్  క్రైం... యూఎస్  లో 4గురు తెలుగువారు అరెస్ట్!
X

ఇటీవల కాలంలో అమెరికాలో వెలుగుచూస్తున్న తెలుగువారికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మరో షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... నలుగురు తెలుగువారిని ప్రిన్స్ టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఇష్యూ కావడం గమనార్హం.

అవును... అమెరికాలోని టెక్సాస్ లో మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు తెలుగువారు అరెస్టయ్యారు. ఈ సందర్భంగా నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు అటు యూఎస్ లోని తెలుగు కమ్యునిటీలో హాట్ టాపిక్ గా మారుతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా కొలిన్ కౌంటీలోని ప్రధాన నిందితుడు సంతోస్ కట్కూరి నివాసంలో 15 మంది మహిళలను ప్రిన్స్ టన్ పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సంతోష్ కట్కూరి భార్య ద్వారక వీరిని తమ షెల్ కంపెనీల్లో వీరందరితోనూ బలవంతంగా పనిచేయించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారని అంటున్నారు. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు! ఈ సందర్భంగా గిన్స్ బర్గ్ లేన్ లోని ఇంటిని సోదా చేసినట్లు చెబుతున్నారు.

ఈ సోదాల్లో అనేక ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్ లు, ప్రింటర్లు, కొన్ని మోసపూరిత డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు! ప్రిన్స్ టన్, మెలిస్సా, మెకిన్నే నగరాల్లో వీరితో బలవంతంగా పని చేయించుకుంటున్నారని అంటున్నారు! ఈ సందర్భంగా పట్టుబడిన ఆ నలుగురికి మానవ అక్రమ రావాణాకు పాల్పడిన కేసులో అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు తెలిపారు.

ఇదే క్రమంలో... నిందితులను మెలిస్సాకు చెందిన సంతోష్ కట్కూరి (31), ద్వారకా గుండా (31), చందన్ దాసిరెడ్డి (24), ప్రాసపర్ కు చెందిన అనిల్ మాలే (37) గా గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా... లేబర్ ట్రాఫికింగ్ ఆపరేషన్ గురించి సమాచారం ఉన్న ఎవరైనా ప్రిన్స్‌ టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ కు 972-736-3901 కు కాల్ చేయాలని లేదా 911కి డయల్ చేయాలని కోరారు.