Begin typing your search above and press return to search.

అమెరికాలో హైదరాబాద్‌ మహిళ ఆత్మహత్య... కారణం ఇదే?

కారణం ఏదైనా.. అది ఎంతపెద్దదైనా.. మరెంత చిన్నదైనా.. ఆత్మహత్యలే శరణ్యం అని భావించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని ఘణాంకాలు చెబుతున్నాయి!

By:  Tupaki Desk   |   2 Sept 2023 1:38 PM IST
అమెరికాలో హైదరాబాద్‌ మహిళ ఆత్మహత్య... కారణం ఇదే?
X

కారణం ఏదైనా.. అది ఎంతపెద్దదైనా.. మరెంత చిన్నదైనా.. ఆత్మహత్యలే శరణ్యం అని భావించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని ఘణాంకాలు చెబుతున్నాయి! ఈ క్రమంలో తాజాగా అమెరికాలో స్థిరపడిన తెలంగాణ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

అవును... అమెరికాలో తెలుగు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పరిధిలోని అమ్మనబోలు చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూర్య దంపతులు హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సూర్యోదయ కాలనీలో నివాసముండేవారు. వీరికి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డికి 18 ఏళ్ల క్రితం కవితతో వివాహం జరిగింది.

వివాహం అనంతరం ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, కవిత దంపతులు అమెరికాకు వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుండగా.. కవిత గృహిణిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత కొద్ది కాలంగా కవిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆ సమస్యలు మరింత పెరగడంతో 40 ఏళ్ల కవిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన భర్త శ్రీనివాస్ రెడ్డి.. కవిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపినట్లు తెలిసింది. అయితే... కవిత మృదేహాన్ని భారత్ కు తీసుకొస్తారా.. లేక అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది.