అమెరికా వీధుల్లో నిస్సహాయ స్థితిలో తెలుగు అమ్మాయి...
అమెరికా వెళ్లిన హైదరాబాద్ అమ్మాయి ఏమైందో ఏమో తీవ్రమైన డిప్రెషన్ లో చికాగో రోడ్ల పై కనిపించిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 26 July 2023 1:38 PM GMTమాస్టర్స్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లిన అమెరికా అమ్మాయి తీవ్ర డిప్రెషన్ కి గురైందని తెలుస్తుంది. ఆమె మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యిందని, ఫుల్ డిప్రెషన్ లో ఉందని, ఆకలి తో అలమటిస్తోందని, చికాగో రోడ్లపై కనిపించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ అమ్మాయి ఏమైందో ఏమో తీవ్రమైన డిప్రెషన్ లో చికాగో రోడ్ల పై కనిపించిందని తెలుస్తుంది. ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే సమయం లో తన కుమార్తెను భారత్ కు రప్పించేందుకు సాయం చేయమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు లేఖ రాసింది.
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ మౌలాలీకి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఆగస్టు 2021 లో డెట్రాయిట్ వెళ్లింది. అక్కడి ట్రినీ యూనివర్శిటీ లో చేరింది. ఆ సమయంలో రెగ్యులర్ గా ఫ్యామిలీకి టచ్ లో ఉండేది. అయితే రెండు నెలలుగా ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కి టచ్ లో లేకుండా పోయింది.
ఈ సమయం లో ఆమె చికాగో రోడ్ల పై అసహజంగా కనిపించడంతో ఇద్దరు హైదరాబాద్ యువకులు ఆ విషయాన్ని ఆమె తల్లికి తెలియజేశారని తెలుస్తోంది. దీంతో... తన కూతుర్ని ఇండియాకు రప్పించేలా తమకు సాయం చేయమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ను వేడుకుంటూ లేఖ రాసింది ఆమె తల్లి.
ఆ లేఖ ను భారత రాష్ట్ర సమితి నాయకుడు ఖలీకర్ రెహమాన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. "హైదరాబాద్ నుండి మిస్. సయ్యదా లులు మిన్హాజ్ జైదీ... టి.ఆర్.ఐ.ఎన్.ఇ. యూనివర్సిటీ, డెట్రాయిట్ లో ఎం.ఎస్. చేయడానికి చికాగో వెళ్లారు. అక్కడ చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె తల్లి విజ్ఞప్తి మేరకు ఆమెను తిరిగి ఇండియా కు తీసుకురావడంలో తక్షణ సాయాన్ని అందించాలి" కోరుతూ జైశంకర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.