Begin typing your search above and press return to search.

ప్రవాస భారతీయునిపై ఇంటి యజమాని దారుణం.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా సోషల్ మీడియాలో ఓ టేనెంట్ తన ఇంటి ఓనర్ చేతిలో ఎదుర్కొంటున్న అరాచకాన్ని చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   5 Oct 2024 9:00 PM GMT
ప్రవాస భారతీయునిపై ఇంటి యజమాని దారుణం.. వైరల్ అవుతున్న వీడియో..
X

విద్య ,ఉద్యోగ అన్వేషణలో స్వదేశాన్ని వదిలి ఎందరో విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. మన చుట్టుపక్కల ప్రతి ఇంట్లో కనీసం ఒకరైన ఫారిన్ కి వెళ్లి ఉంటారు. అయితే అలా వెళ్ళిన వాళ్లలో ప్రతి ఒక్కరూ సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు అన్న గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోలు చూస్తుంటే ప్రవాస భారతీయుల పరిస్థితి కంటతడి పెట్టిస్తోంది..

తాజాగా సోషల్ మీడియాలో ఓ టేనెంట్ తన ఇంటి ఓనర్ చేతిలో ఎదుర్కొంటున్న అరాచకాన్ని చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.కెనడాలోని అంటారియోలో జరిగిన ఓ ఇన్సిడెంట్ తాలూకు 15 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఇంట్లో అద్దెకుంటున్న ప్రవాస భారతీయుడు పై ఆ ఇంటి యజమాని ప్రవర్తిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా విపరీతమైన కోపం కూడా తెప్పిస్తోంది.

ఆ వీడియోలో కనీస కనికరం కూడా లేకుండా ఆ ఇంటి యజమాని అద్దెకున్న వ్యక్తి సామాన్లను వీధిలోకి విసిరి కొడుతున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్న ఆ టెనెంట్ ఇంటి యజమానితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కనీసం అతని ఒంటి మీద షర్టు కూడా లేదు.. ఇంట్లో రిలాక్స్ అవుతున్న అతన్ని అలాగే వీధిలోకి నెట్టేస్తున్నాడు. ఇది చూసిన ఎందరో మండిపడుతున్నారు. ఇటువంటి ఇంటి యజమానులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. అద్దెకున్న వ్యక్తి కచ్చితంగా ఇంటి యజమాని పై కోర్టులో కేసు వేయాలని వారు తమ అభిప్రాయాన్ని ఆన్లైన్లో వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇంటి యజమాని ఎందుకు ఖాళీ చేయిస్తున్నాడు.. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది అన్న విషయాల గురించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఏదేమైనాప్పటికీ అలా ప్రవర్తించడం మాత్రం అమానుషమని అందరూ భావిస్తున్నారు. ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టే ఇంటి యజమానులు అద్దెకు ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయించడంపై కఠినమైన చట్టాల ఏర్పాటు జరుగుతుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.