Begin typing your search above and press return to search.

అమెరికాలో దొంగలకు మనవాళ్లే టార్గెట్... కారణం ఇదే!

భారతీయ మహిళలకు బంగారు ఆభరణాలపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:50 AM GMT
అమెరికాలో దొంగలకు మనవాళ్లే టార్గెట్... కారణం ఇదే!
X

భారతీయ మహిళలకు బంగారు ఆభరణాలపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో... అమెరికాలో ఉన్న భారతీయ, దక్షిణాసియా కుటుంబాలను అమెరికాలో దొంగలు టార్గెట్ చేస్తున్నారు. రెక్కీ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు.. ఇదే సమయంలో చైన్ స్నాచింగ్ లు కూడా పెరుగుతున్నాయి.

అవును... అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో భారతీయ, దక్షిణాసియా కుటుంబాలను చైన్ స్నాచర్లు టార్గెట్ చేస్తున్నారు. ఆడవాళ్లు ధరించే ఖరీదైన ఆభరణాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారని స్థానిక మీడియా వెల్లడిస్తోంది. దొంగలు ముఖ్యంగా భారతీయ మహిళలను టార్గెట్ చేస్తున్నారని దర్యాప్తులో తేలిందని అంటున్నారు.

ఇదే విషయాలను వివరిస్తోన్న అధికారులు... ఈ దొంగలు తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. ఇందులో భాగంగా యజమానులు ఉన్నారా లేదా అనే విషయంపై ముందుగానే స్పష్టత తెచ్చుకుంటున్నారని అంటున్నారు. ఎలాంటి ఆర్ట్‌ వర్క్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకోవడం లేదని.. కేవలం బంగారం, విలువైన వాచ్ లు వంటి వస్తువులను దొంగిలిస్తున్నారని తెలిపారు.

ఇదే సమయంలో రెక్కీ నిర్వహించడంతోపాటు... ఇల్లు వదిలి బయటకు వెళ్తున్న సమాచారం, టూర్ లకు, క్యాంపు లకు వెళ్తున్న సమాచారాన్ని సోషల్ మీడియాలో అప్ డేట్ చేయడం వల్ల కూడా.. దొంగలు పక్కా సమాచారంతో ముందుకు పక్క ప్లాన్ తో తొందగతనాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా భారతీయ-అమెరికన్ సమీర్ దేశాయ్ ఇంట్లో జరిగిన దోపిడీని ఉదహరిస్తున్నారు.

తాజాగా లింకన్‌ లోని సమీర్ దేశాయ్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారట దొంగలు. జూలై ప్రారంభంలో ఈ కుటుంబం పది రోజుల పాటు ట్రావెలింగ్ లో ఉందని.. ఆ సమయంలో ఆ ఇంటి రెండవ అంతస్తు కిటికీ నుండి వారు ఇంట్లోకి ప్రవేశించారని చెబుతున్నారు. ఈ సమయంలో ఇంట్లోని నగలు, పర్సులు, గడియారాలు వంటి వస్తువులను దొంగిలించారని దేశాయ్ ఫేస్‌ బుక్ పోస్ట్‌ లో తెలిపారు.

మరోపక్క చైన్ స్నాచర్లు కూడా భారత మహిళలను టార్గెట్ చేస్తున్నారు గత జూన్‌ లో న్యూజెర్సీలోని ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీ దొంగతనాలకి గురయ్యే ప్రమాదం ఉందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) హెచ్చరించింది. అక్టోబర్ 2022లో.. న్యూయార్క్‌ లోని నాసావు కౌంటీలో భారతీయ-అమెరికన్‌ ల నగలను, విలువైన వస్తువులను టార్గెట్ చేసిన కొలంబియన్ దొంగల ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.

దీంతో ఇల్లు వదిలి టూర్ లకు వెళ్లాలన్నా... సోషల్ మీడియాలో టూర్ల స్టేటస్ లు పెట్టాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.