Begin typing your search above and press return to search.

ఇతర దేశాల్లోని ఇండియన్లకు టెన్షన్

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక్కసారిగా బియ్యానికి కరువొచ్చేసింది. అయితే కరువు మనదేశంలో కాదు విదేశాల్లో. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన నాలుగు రోజులుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు బియ్యం దొరకటం లేదు.

By:  Tupaki Desk   |   23 July 2023 7:06 AM GMT
ఇతర దేశాల్లోని ఇండియన్లకు టెన్షన్
X

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక్కసారిగా బియ్యానికి కరువొచ్చేసింది. అయితే కరువు మనదేశంలో కాదు విదేశాల్లో. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన నాలుగు రోజులుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు బియ్యం దొరకటం లేదు. బియ్యం స్టాక్ లేదని పై దేశాల్లోని చాలా డిపార్ట్ మెంట్ స్టోర్లలో నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. దాంతో ప్రవాస భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు.

దానికి కారణం ఏమిటంటే స్టోర్లలో ఉన్న సరుకు మొత్తాన్ని కొద్దిమంది అవసరానికి మించి ఎగబడి కొనేయటమే. ఎందుకు ప్రవాస భారతీయులు బియ్యాన్ని అవసరాలకు మించి కొనేసినట్లు ? ఎందుకంటే మనదేశం నుండి బియ్యం ఎగుమతులను నరేంద్రమోడీ ప్రభుత్వం నిషేధించటమే. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించటంతో విదేశాలకు బియ్యం సరఫరా ఆగిపోయింది. దాంతో మళ్ళీ బియ్యం ఎప్పుడు వస్తుందో ఏమో అన్న భయంతో దొరికిన బియ్యాన్ని కొంతమంది కొనేశారు.

అప్పటివరకు నెలకు 10 కేజీల బియ్యాన్ని కొనే ప్రవాస భారతీయుల్లో కొందరు ఐదారు బ్యాగులు కొనేశారు. కొందరైతే 10 బ్యాగులు కూడా కొనేశారట. దాంతో స్టోర్లలో బియ్యం అయిపోయింది. అంటే నెలవారీ కొనే బియ్యాన్ని కొందరు ఏడాదికి సరిపడా ఒకేసారి కొనేశారు. దాంతో మిగిలిన వాళ్ళు కొనటానికి బియ్యం కొరత వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో మనిషికి ఒక బ్యాగ్ చొప్పున అమ్మినా సరుకంతా అయిపోవటం ఆశ్చర్యంగా ఉంది. దొరికిందే ఛాన్సని స్టోర్ల వాళ్ళు కూడా 10 డాలర్ల బియ్యాన్ని 50 డాలర్లు, 100 డాలర్లకు అమ్ముకున్నారు.

భారతీయులు ఎక్కడున్నా ముందుగా కొనేది బియ్యం, గోధుమలనే. అలాంటిది ఇపుడు బియ్యం కొరత ఏర్పడటంతో నానా అవస్థలు పడుతున్నారు. సడెన్ గా కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఎందుకు నిషేధం విధించిందో అర్ధంకావటం లేదు. గతంలో గోధుమలను కూడా ఇలాగే నిషేధం విధించింది. అప్పుడు కూడా గోధుమలు ఎక్కువగా వాడే ఉత్తరాది రాష్ట్రాల జనాలు నానా అగచాట్లు పడ్డారు. మొత్తానికి మోడీ ప్రభుత్వ నిర్ణయాలు ఎవరికీ సంతృప్తిగా లేవని అర్ధమవుతోంది.