టెక్సాస్ లో వ్యభిచారం... ఐదుగురు తెలుగు యువకులు అరెస్ట్!
దేశంకాని దేశంలో ఉన్నత చదువులు, బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవడం కోసం వెళ్లిన తెలుగు యువకులు వ్యభిచారం కేసులో చిక్కుకున్నారు
By: Tupaki Desk | 22 Aug 2024 5:34 AM GMTదేశంకాని దేశంలో ఉన్నత చదువులు, బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవడం కోసం వెళ్లిన తెలుగు యువకులు వ్యభిచారం కేసులో చిక్కుకున్నారు. ఈ విషయం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టించింది. హాయ్ ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో జరిగిన ఈ ఆపరేషన్ లో 14 మందిని అరెస్ట్ చేయగా.. అందులో ఏడుగురు భారతీయులని తెలుస్తోంది.
అవును... ఆగస్టు 14 - 15 తేదీలలో డెంటన్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్, షెరీఫ్ ట్రేసీ మర్ఫ్రీ నేతృత్వంలో.. టెక్సాస్ లోని డెంటన్ లో జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో అరెస్టైన వారిలో ఐదుగురు తెలుగు యువకులు సహా ఏడుగురు భారతీయులు ఉన్నారు. మిగిలినవారిలో ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.
వ్యభిచారాన్ని కోరడం టెక్సాస్ రాష్ట్ర చట్టాల ప్రకారం జైలు శిక్షకు అర్హమైన నేరంగా వర్గీకరించారు. ఉన్నత చదువుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన యువకులు ఇలా పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది.
ఇలా టెక్సాస్ లో భారతీయ యువకుల అరెస్ట్ లు స్థానిక సమాజంలో ఆందోళనలను హైలెట్ చేశాయి. ప్రధానంగా అరెస్టైన వ్యక్తుల్లో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారన్ని అంటున్నారు. ఈ విధంగా భారతీయ యువకులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి వ్యభిచార కార్యకలాపాల్లో అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది.