Begin typing your search above and press return to search.

ఇండియా రామంటున్న ఎన్నారైలు... ఇదే ప్రధాన కారణం?

సుమారు 65% మంది తమ మాతృ దేశానికి తిరిగి రావడానికి ఇష్టపడటం లేదని వెల్లడైంది

By:  Tupaki Desk   |   29 July 2023 3:48 AM GMT
ఇండియా రామంటున్న ఎన్నారైలు... ఇదే ప్రధాన కారణం?
X

భారతదేశాన్ని వదులుకోవడానికి చాలా మంది భారతీయులు సిద్ధంగా ఉన్నారని.. భారతదేశ పౌరసత్వాన్ని శాస్వతంగా వదులుకుని, ఇతర దేశాల్లో శాస్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వారంతా సిద్ధమవుతున్నారు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎస్. జైశంకర్ వివరాలు ఘణాంకాలతో సహా వివరించిన సంగతి తెలిసిందే.

ఈ సమయంలో భారతదేశం కోసం ఉద్యోగాలకోసమో, చదువుల కోసమో వెళ్లిన వారు చాలామంది తిరిగి ఇండియాకు రావడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. ఈ మేరకు తాజాగా విడుదలైన వివరాలు వీరి సంఖ్యను, అందుకు గల కారణాలను తెరపైకి తెచ్చింది. ఈ నెంబర్స్ షాకింగ్ గా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తోన్నాయి.

అవును... ఇటీవలి భారతీయ అమెరికన్లపై నిర్వహించిన సర్వేలో కేవలం 33% మంది మాత్రమే భారతదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని తేలింది. సుమారు 65% మంది తమ మాతృ దేశానికి తిరిగి రావడానికి ఇష్టపడటం లేదని వెల్లడైంది. అంటే... వందలో 65 మంది అమెరికా వెళ్లడమే తప్ప.. ఇండియాకు రావాలనే ఆలోచన చేయడం లేదన్నమాట!

ఇదే సమయంలో... 76% భారతీయ అమెరికన్లు.. భారతదేశం పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉండగా.. 51% మంది మాత్రమే "చాలా అనుకూలమైన" అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. మరోవైపు, 86% మంది యూఎస్ పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉండటం గమనార్హం.

అయితే భారతదేశం పట్ల అనుకూలత చూపిస్తున్నప్పటికీ కొంతమంది ఒకటైంలో తిరిగిరాకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా... తమ పిల్లల చదువుల కారణంగా భారతదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారని అంటున్నారు.

కారణం... అమెరికాలో గ్రేడ్ 12 వరకు విద్య ఉచితం. ఇది ఎన్నారైలకు అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి అని తెలుస్తోంది. పైగా... భారతదేశంలో చాలా మంది ఖరీదైన అంతర్జాతీయ పాఠశాలలను ఎంచుకుంటారు.. ఇది గణనీయమైన ఆర్థిక భారానికి దారి తీస్తుంది. అలా కాకుండా అక్కడే సెటిల్ అయితే ఆ భారం అస్సలు లేకుండా పోతోంది!

మరోపక్క భారతీయ పెద్దలకు, భారతదేశానికి తిరిగి వెళ్లడానికి ప్రధాన కారణాలలో తక్కువ జీవన వ్యయం కాగా... కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరిక ఉండటం మరొకటని అంటున్నారు. వీరిలో 4% మంది మాత్రం వచ్చే దశాబ్దంలో భారతదేశం అగ్రగామి ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడుతుండటం గమనార్హం.