హిమాలయాలు అదే వేడి తరంగాలను ఎదుర్కొంటే...?
గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది.. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం వల్ల భూవాతావరణం వేడెక్కిపోతుంది. నానాటికీ ఉష్ణోగ్రతలు అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి.
By: Tupaki Desk | 23 July 2023 3:58 AM GMTగ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది.. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం వల్ల భూవాతావరణం వేడెక్కిపోతుంది. నానాటికీ ఉష్ణోగ్రతలు అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సముద్ర తీరంలో వున్న చాలా ప్రాంతాలు, దీవులు కనుమరుగవుతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
భూతాపానికి ప్రధాన కారణం... కార్బన్ డై ఆక్సైడ్. దీనికి తోడు మిథేన్ వాహనాలు విడుదల చేసే అనేక విష వాయువులు. రిఫ్రిజిరేటర్ల నుండి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు. వాతావరణంలో వీటి శాతం తగ్గాలంటే ఆక్సిజన్ పర్సంటేజ్ పెరగాలి. అదిజరగాలంటే చెట్లు పెరగాలి.
పర్యావరణ వేత్తలు ఎన్ని చెప్పినా వినేవారే తప్ప ఆచరించేవారు బహుతక్కువ అనే మాటలు నిత్యం వినిపిస్తుంటాయి. ఈ సమయంలో ప్రకృతి మాత్రం తనపని తాను చేసుకుంటూపోతుంది. ఇందులో భాగంగా... ఇటలీలో పర్వత ప్రాంతాలపై చెడుగాలుల ప్రభావం కనిపించింది.
ఇటలీలోని కొన్ని ప్రాంతాలను వడగండ్ల వానలు కొట్టడంతో 110 మందికి పైగా గాయపడ్డారు, వీధులన్నీ మంచుతో నిండిన నదులుగా మారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించడంతోపాటు.. భవిష్యత్తును కళ్లముందు చూపిస్తున్నాయి!
అవును.. ఇటలీలో వేడిగాలుల మధ్య, దేశంలోని ఉత్తర ప్రాంతాలను వడగళ్ల వానలు అతలాకుతలం చేశాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలు సెరెగ్నో వీధుల్లో మంచుతో నిండిన నీటి ప్రవాహాన్ని చూపించాయి. భారీ వడగళ్ళు భవనాలపై పడటం కనిపించిందని స్థానిక మీడియా నివేదించింది.
ఉత్తర ఇటలీలో కురిసిన వడగళ్ల వాన కారణంగా కనీసం 110 మంది గాయపడ్డారు. లోంబరీ ప్రాంతంలోని అనేక పట్టణాలు కూడా ప్రభావితమయ్యాయి. కుండపోత వర్షం, బలమైన గాలులతో పాటు వడగళ్ళు కలిసి... ఆకస్మిక వరదలకు దారితీసింది, ఉత్తర ఇటలీని విధ్వంసం చేసింది. ఫలితంగా... వెనెటో గవర్నర్ లూకా జైయా అత్యవసర పరిస్థితిని ప్రకటించమని ప్రేరేపించింది.
దీనివల్ల ఆస్తి నష్టం, గాయాలు కారణంగా సహాయం కోసం ఈ ప్రాంతానికి 500 కంటే ఎక్కువ కాల్ లు వచ్చాయి. ఇదే సమయంలో వడగళ్లు 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగినవని, అద్దాలు పగిలిపోవడం, వడగళ్లపై ప్రజలు జారిపోవడం వల్లే చాలా వరకు గాయాలయ్యాయని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. ఇటాలియన్ వాతావరణ శాస్త్ర సంఘం తాజా హీట్ వేవ్ కు "సెర్బెరస్" అని పేరు పెట్టింది. డాంటే ఇన్ఫెర్నోలో నరకం ద్వారాలకు కాపలాదారుగా మూడు తలల రాక్షసుడు కనిపించిన తర్వాత "సెరెబెరస్" రూపొందించబడింది.
ఈ సందర్భంగా... "భూమికి అధిక జ్వరం ఉంది.. దీన్ని ఇటలీ ప్రత్యక్షంగా అనుభూతి చెందుతోంది" అని ఇటాలియన్ వాతావరణ శాస్త్ర సొసైటీ అధిపతి లూకా మెర్కల్లీ చెబుతున్నారు. దీంతో... ఈ వాతావరణంలోని వేడి ప్రభావం హిమాలయాలపై కూడా చూపిస్తే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
అవును... భూతాపం వేడెక్కడం వల్ల తాజాగా ఇటలీలో జరిగిన పరిణామాలే భారత్ లోని హిమాలయాల్లో జరిగితే పరిస్థితి ఏమిటో ప్రజలంతా ఆలోచించుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడైనా పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలి!