వృద్ధుడిని చంపిన పిల్లలు.. కారణం ఏమై ఉండొచ్చు?
వారికి అంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది..? 80 ఏళ్ల వృద్ధుడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..?
By: Tupaki Desk | 4 Sep 2024 7:30 PM GMTటీవీల, సెల్‌ఫోన్లు పిల్లలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతాయని అనడానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పాలి. ఏమీ తెలియని చిన్న పిల్లలు ఓ వృద్ధుడిని హత్య చేశారు. వారికి అంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది..? 80 ఏళ్ల వృద్ధుడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..?
లీసెస్టర్ సమీపంలోని బ్రాన్‌స్టోన్ టౌన్‌లోని ఫ్రాంక్లిన్ పార్క్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ పిల్లల గుంపు వృద్ధుడిపై దాడికి పాల్పడింది. ఐదుగురు పిల్లలు వృద్ధుడిపై దాడి చేసి హతమార్చారు. 12 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు ఈ హత్య చేశారు.
లీసెస్టర్ సమీపంలోని బ్రాన్‌స్టోన్ టన్‌లోని ఫ్రాంక్లిన్ పార్క్‌లో 80 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వృద్ధుడు భీమ్ సేన్ కోహ్లీ ఈనెల 1వ తేదీన కుక్కతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఐదుగురు విద్యార్థులు గుంపుగా వచ్చి ఒక్కసారిగా దాడికి దిగారు. మెడ, వెనుక భాగంలో బాగా తన్నారు. కోహ్లీ ఇంటికి సమీపంలోనే జరిగిన ఈ దాడితో ఆ మరుసటి రోజే కోహ్లీ చనిపోయాడు. అయితే.. దాడి చేశాక ఆ బృందం అక్కడి నుంచి పారిపోయింది. కోహ్లి చాలా అవస్థ పడినట్లు స్థానికులు తెలిపారు.
కోహ్లీ మరణంపై పోలీసులు హత్య దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధుడిని హత్య చేశారనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడు, ఓ బాలిక, 12 ఏళ్ల బాలికలను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న పిల్లలు ఇంతటి దారుణానికి ఒడిగట్టడాన్ని కోహ్లి కూతురు తట్టుకోలేకపోయింది. ఈ దారుణాన్ని అత్యంత క్రూరమైనదిగా చెప్పింది. తన తండ్రి నిత్యం పార్క్‌లో ఉండేవారని, ఇప్పుడు ఆయన మా నుంచి దూరం అయ్యాడని తెలిపింది. కాగా.. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ హత్య కేసు కింద నమోదు చేశారు.