Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డుల జారీలో భారతీయులకు ప్రయారిటీ ఇవ్వాలంటూ తాజా లేఖ

భారత్ నుంచి అమెరికాకు వచ్చిన భారతీయులకు గ్రీన్ కార్డుల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదనను బలంగా వినిపించేందుకు ముందుకు వచ్చారు అమెరికన్ కాంగ్రెస్ నేతలు.

By:  Tupaki Desk   |   30 July 2023 5:11 AM GMT
గ్రీన్ కార్డుల జారీలో భారతీయులకు ప్రయారిటీ ఇవ్వాలంటూ తాజా లేఖ
X

అమెరికాకు వెళ్లటం ఒక కల. దాన్ని తీర్చుకున్నంతనే అందరి మదిలో మెదిలే స్వప్నం.. గ్రీన్ కార్డును సొంతం చేసుకోవటం. అమెరికాలో శాశ్విత నివాసానికి వీలుగా జారీ చేసే గ్రీన్ కార్డుల కోసం లక్షలాది మంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఇది భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వారు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వారు ఇలాంటి కలనే కంటుంటారు. అయితే.. భారత్ నుంచి అమెరికాకు వచ్చిన భారతీయులకు గ్రీన్ కార్డుల జారీలో ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదనను బలంగా వినిపించేందుకు ముందుకు వచ్చారు అమెరికన్ కాంగ్రెస్ నేతలు.

తాజాగా భారత సంతతికి చెందిన రాజా క్రిష్ణమూర్తి.. లేరీ బుక్ షాన్ ఆధ్వర్యంలో దాదాపు 56 మంది ఎంపీలు బైడెన్ సర్కారుకు లేఖ రాశారు. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు అవి రావాలంటే 195 ఏళ్లు వెయిల్ చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్న వారికి వాటిని జారీ చేసే విషయంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. దేశాల వారీగా ఏడు శాతం కోటాను గ్రీన్ కార్డుల జారీ విధానాన్ని అమలు చేస్తున్న కారణంగా భారత్ నుంచి వచ్చే వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని వారు ప్రస్తావించారు.

ఇదే అంశాన్ని ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పొరా స్టడీస్ సంస్థ కూడా బైడెన్ సర్కారుకు విన్నవించింది. గ్రీన్ కార్డులు జారీ కాకపోవటంతో పలువురు యజమానుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోందని. దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 10 లక్షల మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. అధికార యంత్రాంగంలోని అలసత్వం కారణంగా వీసాలు పెండింగ్ లో ఉన్న కారణంగా ఉద్యోగాలు మారాలనుకునే వారికి.. వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే వారికి.. అపరాధ రుసుం లేకుండా ఫారిన్ కు జర్నీ చేయాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. ఈ లేఖపై బైడెన్ సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.