ఆంధ్రా టు అమెరికా... బాబు అరెస్ట్ పై పోటాపోటీ నిరసనలు!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుని విడుదల చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Sep 2023 11:01 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుని విడుదల చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూర్లలో కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు నిరసనలు తెలిపారు. ఈ సమయంలో హైదరాబాద్ లో అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు సహేతుకమైన చర్య, అవినీతి చేస్తే స్థాయితో సంబంధం లేదు, ఎత్తి లోపల వేయడమే అంటూ మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఈ రోజు హైదరాబాద్ లో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా కార్లకు వైసీపీ జెండాలు కట్టి ర్యాలీ చేపట్టారు. అవినీతిపరులకు మద్దతు పలకడం దరైన చర్య కాదని నినాదాలు చేశారు!
ఈ క్రమంలో తాజాగా అమెరికాలో కూడా కొంతమంది తెలుగు సంఘాలకు చెందిన వ్యక్తులు, టీడీపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఇందులో భాగంగా "వీ ఆర్ విత్ సిబిఎన్" అనే ఫ్లకార్డులు చేతపట్టి, నలుపు దుస్తులు ధరించి కనిపించారు. ఇదే సమయంలో సెల్ ఫోన్ లైట్లను ఆన్ చేసి వాటిని చూపిస్తూ చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు.
అవును... అగ్రరాజ్యం అమెరికాలోని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా... కాలిఫోర్నియా, అరిజోనా, డల్లాస్, జెర్సీ, చికాగోలలో నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ వీరు నినాదాలు చేయడం గమనార్హం. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు.. జనసేన ఎన్నారై వింగ్ కూడా తొడయ్యింది.
దీంతో అమెరికాలో కూడా చంద్రబాబు నిరసన సరైన చర్యే అని ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ ను సపోర్ట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా అమెరికాలో నిరసనలూ చేపట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇలా అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ కొంతమంది... ఇది సరైన చర్యే అని స్వాగతిస్తూ మరికొంతమంది పోటాపోటీగా నిరసనలు తెలుపుతూ, ర్యాలీలు చేపట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.