Begin typing your search above and press return to search.

రూ.8,300 కోట్ల స్కామ్.. ఇండో-అమెరికన్‌ కు జైలు శిక్ష!

అవును... బ్లూమ్‌ బెర్గ్ నివేదిక ప్రకారం మిస్టర్ షా తన యూనివర్సిటీ రోజులలో అవుట్‌ కమ్ హెల్త్ అనే ఒక ఆలోచన చేశారు.

By:  Tupaki Desk   |   2 July 2024 6:10 AM GMT
రూ.8,300 కోట్ల స్కామ్.. ఇండో-అమెరికన్‌  కు జైలు శిక్ష!
X

ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త, అవుట్‌ కమ్ హెల్త్ కోఫౌండర్ రిషి షా వ్యవహారం ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అతడు 8,300 కోట్ల స్కామ్ చేసినట్లు కోర్టు నిర్ధారించింది! ఈ నేపథ్యంలో అతడిని అమెరికా కోర్టు ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా స్పందించిన జడ్జ్ థామస్ డర్కిన్... చరిత్రలోని అతిపెద్ద కార్పొరేట్ మోసల్లో ఇదొకటని వ్యాఖ్యానించారు!

అవును... బ్లూమ్‌ బెర్గ్ నివేదిక ప్రకారం మిస్టర్ షా తన యూనివర్సిటీ రోజులలో అవుట్‌ కమ్ హెల్త్ అనే ఒక ఆలోచన చేశారు. వాస్తవానికి కాంటెక్స్ట్ మీడియా హెల్త్ అని పిలువబడే ఈ సంస్థ రోగులను లక్ష్యంగా చేసుకుని ఆరోగ్య ప్రకటనలను ప్రసారం చేయడానికి వైద్యుల కార్యాలయాల్లో టెలివిజన్‌ లను ఇన్‌ స్టాల్ చేసి వైద్య ప్రకటనలను అందిస్తుంది. ఈ సంస్థ 2006లో స్థాపించబడింది.

షాను అతని సహ-వ్యవస్థాపకురాలు శ్రద్ధా అగర్వాల్.. ఈ సంస్థ వాల్యుయేషన్‌ కు సంబంధించినంతవరకు కంపెనీ వృద్ధి విపరీతంగా పెరిగిందని చెప్పారు. యాడ్ ప్లేస్‌ మెంట్‌ ల ద్వారా రోగులు, హెల్త్‌ కేర్ ప్రొవైడర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ ను వినూత్నంగా తగ్గించాలనే తపనతో టీం వర్క్ చేసేదట. ఈ క్రమంలో 2010 నాటికి అవుట్‌ కమ్ హెల్త్ టెక్, హెల్త్‌ కేర్ ఇన్వెస్ట్‌మెంట్ కమ్యూనిటీలలో పెద్ద ప్లేయర్‌ గా ఉద్భవించింది.

దీంతో... ఉన్నత స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఫలితంగా రిషి షా చికాగో కార్పొరేట్ సర్కిల్‌ లలో స్టార్‌ గా అవతరించారు. అయితే పైకి సంస్థ అద్భుతంగా కనిపిస్తున్నా... పునాదులు మాత్రం పాడైపోతున్నాయట. ఈ నేపథ్యంలో కంపెనీ ఆర్థిక పరిస్థితిని తప్పుగా చెబుతూ.. పెట్టుబడిదారులు, క్లయింట్లను మోసం చేశారని న్యాయవాదులు తెలిపారు. కంపెనీ లాభాల్లో ఉందని చెప్పి ప్రకటనల కోసం డబ్బులు తీసుకుని పలు కంపెనీలను బురిడీ కొట్టించారు.

ఈ నేపథ్యంలో రిషి షా బాగా సంపాదించారని.. పెంచిన ప్రకటనల అమ్మకాలు, పెట్టుబడిదారుల నుంచి వచ్చే డబ్బు బాగా అందిందని చెబుతున్నారు. ఫలితంగా... ప్రైవేట్ జెట్ లు, ప్రైవేట్ నౌకలలో విదేశీ పర్యటనలు చేశారని అంటున్నారు. సుమారు 10 మిలియన్ డాలర్లు పెట్టి ఇంటిని కొనుగోలు కూడా చేశారట. 2016లోనే అతడి నికర ఆస్థుల విలువ 4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని చెబుతున్నారు.

అయితే... 2017లో వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా ఈ సంస్థ ఆర్థిక పరిస్థితిని, జరుగుతున్న మోసాన్ని బహిర్గతం చేయడంతో ఈ మోసపూరిత కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత గోల్డ్‌ మ్యాన్ సాచ్స్, ఆల్ఫాబెట్, గవర్నర్ ప్రిట్జ్‌ కర్ సంస్థతో కూడిన పెట్టుబడిదారుల బృందం అవుట్‌ కమ్ హెల్త్‌ పై దావా వేసింది. ఈ నేపథ్యంలోనే సుద్దీర్ఘ విచారణ అనంతరం రిషి షాకు కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.