రోబో ట్యాక్సీలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారట
మరీ ఇంత కక్కుర్తా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అమెరికన్లు. టెక్నాలజీ పుణ్యమా అని కొత్తగా వస్తున్న సౌకర్యాల్ని దుర్వినియోగం
By: Tupaki Desk | 31 Aug 2023 4:26 AM GMTమరీ ఇంత కక్కుర్తా? అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అమెరికన్లు. టెక్నాలజీ పుణ్యమా అని కొత్తగా వస్తున్న సౌకర్యాల్ని దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని చూస్తే.. తల పట్టుకోక మానరు. అందివచ్చిన సాంకేతికతతో మరింత మెరుగైన జీవన ప్రమాణాలకు బదులుగా.. కక్కుర్తి పనులు చేయటం ద్వారా కొత్త తలనొప్పుల్ని తీసుకొస్తున్నారు. అగ్రరాజ్యంలోని కాలిఫోర్నియా స్టేట్ లో రోబో ట్యాక్సీలకు అనుమతి లభించటం తెలిసిందే.
ఈ ట్యాక్సీల ప్రత్యేకత ఏమంటే.. ఇందులో డ్రైవర్ ఉండరు. మనం బుక్ చేసిన వెంటనే లొకేషన్ కు చేరుకొని ప్రయాణికుల్ని ఎక్కించుకొని.. వారు కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. అయితే.. ఈ రోబో ట్యాక్సీలను రాత్రి వేళలోనే నడిపేలా అనుమతులు ఇచ్చారు. డ్రైవర్ లేని ఈ రోబో ట్యాక్సీల్లో ఎక్కిన కొందరు.. అసభ్యకర చేష్టలకు తెర తీస్తున్నారు. వెనుక సీటు విశాలంగా ఉండటంతో.. కదిలే కారులో ఆ పని కానిచ్చేస్తున్నారు.
ఒంటరి మహిళలకు.. రాత్రి వేళ ఎయిర్ పోర్టుకు చేరుకునే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ కార్లను సరైన రీతిలో వాడుకుంటే బాగుంటుంది. అందుకు భిన్నంగా తప్పుడు పనులకు వాడుకోవటాన్ని తప్పు పడుతున్నారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఈ కార్లలోకెమేరాలు ఉన్నప్పటికీ.. తమ కక్కుర్తి పనుల్ని కొందర సాగిస్తుండటంతో ఆపరేటర్లకు తలనొప్పిగా మారుతోంది. ఈ రోబో ట్యాక్సీల్లో ఉండే కెమేరాలు ప్రయాణించే వారి భద్రత కోసమని చెబుతున్నారు. వీటిని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తుంటారు. అయితే.. అసభ్యకర కార్యకలాపాలకు కారును వినియోగిస్తే.. హెచ్చరించే వ్యవస్థ ఉంది.
కానీ.. అవేమీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్న వారి సంఖ్య ఎక్కువైందంటున్నారు. మరో షాకింగ్ అంశం ఏమంటే.. అసభ్య చేష్టలకు పాల్పడే వారిని హెచ్చరిస్తే.. ట్యాక్సీని క్లీన్ గా ఉంచాలన్న గైడ్ లైన్ మాత్రమే ఉందని.. సెక్సు చేయకూడదన్న రూల్ ఏమీ అందులో లేదుగా అంటూ లా పాయింట్ తీసుకున్న వారి మాటలు ఆపరేటర్లకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. దీంతో.. ఆపరేటర్లు తమ నిబంధనల్లో రోబో ట్యాక్సీల్లో సెక్సు చేయకూడదు.. అసభ్యకర చేష్టలు చేయకూడదన్న రూల్ ను చేర్చాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.