Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ట్రంప్ కు నో సపోర్ట్. .. ఆరో భారతీయుడి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సమయంలో అమెరికా – భారత్ లపై సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   18 Nov 2024 12:30 PM GMT
ఆ విషయంలో ట్రంప్  కు నో సపోర్ట్. .. ఆరో భారతీయుడి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఎన్నికైన వారిలో ఆరో భారతీయుడు సుహాస్ సుబ్రహ్మణం అనే సంగతి తెలిసిందే. ఈయన త్వరలో ప్రతినిధుల సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ సభ అమెరికా విదేశాంగ విధానాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సమయంలో అమెరికా – భారత్ లపై సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో... భారత్ ను సుంకాల రాజుగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్.. తాను అధికారంలోకి వస్తే భారత్ పై టారిఫ్ ల పెంపు అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే... ట్రంప్ సర్కార్ భారత్ పై టారిఫ్ లు విధిస్తే అది ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారి తీయొచ్చని సుహాస్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పలు విషయాలపై స్పందించారు. ఈ సందర్భంగా టారిఫ్ లు విధించడానికి తాను మద్దతు ఇవ్వను అని సూటిగా చెప్పిన సుహాస్... ఇది ఏ దేశానికి ప్రయోజనకరం కాదు సరికాదా.. దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారి తీయొచ్చని అన్నారు. ఆర్థికంగా భారత్ - అమెరికాలు మరింతగా కలిసి పనిచేయాలని.. అప్పుడే అవి మరింత బలపడతాయని అన్నారు.

ఇప్పటికే భారత్ లోని చాలా కంపెనీలు అమెరికాలో కూడా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని.. ఈ సమయంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో బంధాలు బలపడటం చాలా ముఖ్యమని సుహాస్ వ్యాఖ్యానించారు. వీటితో పాటు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను పూర్తిగా సంస్కరించాల్సి ఉందని.. చట్టపరమైన వలసలపైనే దృష్టి పెట్టాలని అన్నారు.

తాను సరిహద్దులను రక్షించుకోవడానికి కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తాను అని చెప్పిన సుహాస్.. అయితే, అదొక్కటే సరిపోదని.. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని అన్నారు. ఇక.. ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన ప్రభుత్వ సంస్కరణలు అంటే... కేవలం ఉద్యోగులను తొలగించడమే కాదనే విషయాన్ని గ్రహించాలని.. ఉద్యోగాల కోతల యత్నాలను తాను వ్యతిరేకిస్తానని తెలిపారు.

కాగా... సరికొత్తగా ఎన్నికైన ప్రతినిధుల సభలో ఆరో భారతీయుడిగా సుహాస్ సుబ్రహ్మణ్యం నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సభలో... ప్రమీలా జయపాల్, డాక్టర్ అమి బెరా, రాజా కృష్ణమూర్తి, శ్రీరానేదార్, రోఖన్నా ఉన్నారు. వీరందరినీ కలిపి "సమోసా కాకస్"గా వ్యవహరిస్తారు. ఈ సమయంలో... తూర్పు తీరం నుంచి సభకు ఎన్నికైన తొలి భారతీయుడిగా సుహాస్ నిలిచారు.