అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్!
పోలీసులు సైతం రంగంలోకి దిగి రూపేష్ ను గుర్తించే పనిని చేపట్టారు.
By: Tupaki Desk | 9 May 2024 3:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న వరుస ఘటనలు.. ప్రపంచ దేశాల నుంచి అక్కడకు వెళ్లి చదువు కుంటున్న విద్యార్థులనే కాకుండా వారి కుటుంబాలను కూడా కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు.. అంతుపొంతు లేకుండా పోయింది. ఇప్పటికే అనేక మంది పై దాడులు జరిగాయి. పలువురు చనిపోయారు కూడా. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
ఇక, ఇప్పుడు తెలంగాణకు చెందిన విద్యార్థి ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించకపోవడం కలకలం రేపుతోంది. మాస్టర్ డిగ్రీ చేసేందుకు అమెరికాకు వెళ్లిన చింతకింది రూపేష్ చంద్ర.. అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఉన్న కాంకార్డియా యూనివర్సిటీలో చదువుతున్నాడు. అయితే.. ఈయన మే 2వ తేదీ నుంచి కనిపించక పోవడం గమనార్హం. ఇదే విషయాన్ని షికాగోలోని భారత ఎంబసీ వెల్లడించింది. విద్యార్థి రూపేష్ కోసం.. గాలింపు యత్రాలు చేపట్టినట్టు పేర్కొంది.
పోలీసులు సైతం రంగంలోకి దిగి రూపేష్ ను గుర్తించే పనిని చేపట్టారు. పోలీసులు.. స్థానిక ప్రవాస భారతీ యులను సంప్రదిస్తున్నారు. అదేవిధంగా రూపేష్ ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వాలని కూడా ప్రకటన జారీ చేశారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం కూడా నిరంతరం.. రూపేష్ సమాచారం పై దృష్టి పెట్టింది. ఇదిలావుంటే.. రూపేష్ జాడ తెలియడం లేదన్న.. సమాచారంతో తెలంగాణలోని ఆయన కుటుంబం ఆందోళనలో మునిగిపోయింది.
తమ బిడ్డ జాడ కనుగొనులే సహాయం చేయాలంటూ.. భారత విదేశాంగ శాఖను, అమెరికాను సైతం రూపే ష్ కుటుంబం అభ్యర్థించింది. ఇక, తాము నిరంతరం రూపేష్ కోసం ప్రయత్నిస్తున్నామని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం.. సోషల్ మీడియాలో వెల్లడించింది. స్థానిక పోలీసులను కూడా.. సమాచారం కోరుతున్నట్టు పేర్కొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.