అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి!
ఇలా వరుసగా జరుగుతున్న అత్యంత విషాదకరమైన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందారు.
By: Tupaki Desk | 15 Dec 2024 10:19 AM GMTవిదేశాల్లో ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో వెళ్లి వివిధ రకాల ప్రమాదాలతో మృత్యువాత పడుతున్న తెలుగు వారి జాబితాలో మరో విద్యార్థిని చేరారు. ఇలా వరుసగా జరుగుతున్న అత్యంత విషాదకరమైన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో మరో తెలుగు విద్యార్థిని మృతి చెందారు.
అవును... విదేశాల్లో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల్లో తెలుగు వారు మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే! ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతి చెందారు.
ఇదే సమయలో ఆమెతో పాటు ఇద్దరు స్నేహితులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ సమీప ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారని అంటుననరు. ఈ మేరకు స్థానిక అధికారులు విషయాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022 డిసెంబర్ లో అమెరికాకు వెళ్లారు. ఈ క్రమంలో... టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్నారు.
ఈ సమయంలో శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు రాక్ వ్యుడ్ ఎవెన్యూ సమాఈపంలోకి చేరుకున్న సమయంలో ఓ ట్రక్ వెనుక నుంచి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో.. కారు నుజ్జు నుజ్జు అయిపోయిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురుకీ తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో... ఈ ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే... ఆస్పత్రిలో చికిత్స పోందుతూ నాగశ్రీ మృతి చెందినట్లు చెబుతున్నారు. మిగిలిన స్నేహితులలో పవన్ పరిస్థితి విషమంగా ఉండగా.. నికిత్ పరిస్థితి ఉన్నంతలో బెటర్ గా ఉందని అంటున్నారు!