ప్రాణాలు తోడే ‘డంకీ రూట్..’ మరో ఇండియన్ మృతి.. ఇరుక్కున్న కుటుంబం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులు... ఈ అంశం రెండు నెలలుగా తీవ్ర చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 March 2025 4:16 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులు... ఈ అంశం రెండు నెలలుగా తీవ్ర చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే. కారణం.. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తానని ట్రంప్ ప్రకటించడమే.. దీనికితగ్గట్లే వస్తూవస్తూనే విమానాల్లో ఎక్కించి మరీ పంపించేశారు..
తొలి టర్మ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగానే ఉన్నారు. అయితే, ఇప్పటిలా బహిష్కరణలు కాదు. రెండోసారి మాత్రం పదవీ బాధ్యతలు చేపట్టినంతనే గుర్తింపు, తరలింపు అన్నీ చకచకా చేసేశారు. భారతీయులను మూడు విడతలుగా సైనిక విమానంలో వెనక్కి పంపించేశారు.
అయితే, అక్రమ వలసలపై ట్రంప్ తీరు అలా ఉన్నప్పటికీ అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. తాజాగా గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి దక్షిణ అమెరికా దేశం నికరాగ్వాలో ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు డంకీ రూట్ లో వెళ్లే ప్రయత్నంలో చనిపోయాడు. తన కుటుంబం ఇప్పుడు అక్కడే ఇరుక్కుంది.
అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లొద్దంటూ కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నా.. ప్రమాదకరమైనది అయినప్పటికీ డంకీ రూట్ లో అమెరికా వెళ్లందుకు ప్రయత్నిచారు గుజరాత్‌లో ని సబర్‌కాంఠా జిల్లా మోయద్ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్.
వాస్తవానికి అమెరికానే కాదు వివిధ దేశాల్లో వ్యాపారానికి ముందు ఉండేది గుజరాతీనే అనే సంగతి తెలిసిందే. ఇందుకోసం కాకున్నా.. అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనతో దిలీప్ ఇటీవల ఏజెంట్‌ను కలిశాడు. భార్య, చిన్నారితో సహా ముగ్గురిని అమెరికా పంపడానికి రూ.కోటి చెల్లించాడు. ఇందుకోసం భూమిని కూడా విక్రయించాడు.
సరిగ్గా ట్రంప్ అధ్యక్షుడు అయిన సమయం.. అంటే రెండు నెలల క్రితం దిలీప్ పటేల్ కుటుంబంతో సహా టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లి, తర్వాత నికరాగ్వాకు చేరాడు. అక్కడినుంచి డంకీ మార్గంలో ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురయ్యారు.
దిలీకు డయాబెటిస్ ఉంది. డంకీ రూట్లో వెళ్తుండగా మందులు లభించకపోవడంతో అనారోగ్యం బారినపడ్డాడు. కోమాలోకి వెళ్లాడు. అతడి కుటుంబం నికరగ్వాలోనే చిక్కుకుపోయింది.