Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఉషా చిలుకూరి కంప్లీట్ ఫ్యామిలీ!

ఇక, వాన్స్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు మగబిడ్డలు.. ఒక ఆడబిడ్డ ఉన్నారు. వీరిలో కుమారుల పేర్లు ఇవాన్, వివేక్ కాగా... కుమార్తె పేరు మిరాబెల్.

By:  Tupaki Desk   |   18 July 2024 10:30 AM GMT
ఫోటో స్టోరీ: ఉషా చిలుకూరి కంప్లీట్  ఫ్యామిలీ!
X

ప్రస్తుతం అమెరికాలో ఉన్న వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానికానికీ ఉషా చిలుకూరి అనే పేరు హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలు నిజమైతే రిపబ్లికన్ తరుపున అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఎంపికవ్వనున్నారు! దీంతో... అతని భార్య ఉషా చిలుకూరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంచనాలు నిజమైతే ఓ తెలుగు మహిళ అగ్రరాజ్యంలో ద్వితీయ మహిళగా నిలుస్తారు. ఆమె ఉషా చిలుకూరి వాన్స్. ఆమె పూర్వీకులు తెలుగువారు.. గోదావరి జిల్లాలకు చెందినవారు అనే విషయంపై ఉషా మేనత్త శారద ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో... ఉషా కుటుంబంపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉష చిలుకూరి తాత రామశాస్త్రి.. మద్రాసు ఐఐటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. చెన్నైలోనే సెటిల్ అయిపోయారు. ఇక ఉష తండ్రి రాధాకృష్ణ చిలుకూరి.. ఇంజినీరింగ్ పూర్తి చేసి యూఎస్ లో ఎంఎస్ చేశారు. చెన్నైలోని మాలిక్యులర్ బయాలజీ చదివిన లక్ష్మిని వివాహం చేసుకుని.. యూఎస్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయారు.

అనంతరం ఉష అక్కడే జన్మించారు.. శానిడియాగోలో పుట్టి పెరిగారు. ఈ క్రమంలో ప్రఖ్యాత యేలే యూనివర్శిటీలో లా పట్ట అందుకున్న అనంతరం 2014లో వివాహం చేసుకున్నారు. అనంతరం లా అసోసియేట్ గా జాబ్ చేశారు. 2018లో కేంబ్రిడ్జ్ నుంచి ఎంఫిల్ పూర్తిచేసి సుప్రీంకోర్టులో లా క్లర్క్ గా పనిచేశారు.

ఇక, వాన్స్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు మగబిడ్డలు.. ఒక ఆడబిడ్డ ఉన్నారు. వీరిలో కుమారుల పేర్లు ఇవాన్, వివేక్ కాగా... కుమార్తె పేరు మిరాబెల్. ప్రస్తుతం ఉషా చిలుకూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఇద్దరు చిన్న పిల్లలను ఎత్తుకుని ఉషా, వాన్స్ నిలబడి ఉండగా... మరికొంతమంది కుటుంబ సభ్యులు వారితో ఉన్నారు.

కాగా... వాన్స్ సక్సెస్ గురించి ఎప్పుడు ప్రస్థావించినా... వీలైనన్ని ఎక్కువసార్లు తన భార్య ఉషా చిలుకూరి పేరు చెబుతారట, ఆమెను అవకాశం వచ్చిన ప్రతీసారి పొగుడుతారట. ఇక ఉషా అయితే... వాన్స్ లాంటి అద్భుతమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని చెబుతూనే... తన సక్సెస్ సీక్రెట్ తన ‘ఫ్యామిలీ’ అని చెబుతారని అంటున్నారు! ప్రతీ వ్యక్తి విజయంలోనూ కుటుంబ పాత్ర కీలకం అని అంటారు అందుకే!!