ఫోటో స్టోరి: పూల చీరలో తేనెలూరే అందాలు
షిఫాన్ చీర కట్టి సందట్లో సడేమియా ఏంటో కానీ.. అలా పూల చీరలో హనీరోజ్ ఎంతో అందంగా కవ్విస్తోంది.
By: Tupaki Desk | 10 Sep 2023 4:38 AM GMTషిఫాన్ చీర కట్టి సందట్లో సడేమియా ఏంటో కానీ.. అలా పూల చీరలో హనీరోజ్ ఎంతో అందంగా కవ్విస్తోంది. అందానికి అందం వేడెక్కించే సొగసు ఉన్న నటిగా హనీ పేరు మార్మోగుతోంది. నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన అవకాశం అందుకుంది అంటేనే హనీరోజ్ కి లక్ చిక్కిందని అర్థం. బ్లాక్ బస్టర్ అఖండ తర్వాత ఈ అమ్మడి క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఇక రిబ్బన్ కటింగ్ ఆఫర్లకు అయితే కొదవే లేదు. ఒక్కో ఈవెంట్ కి లక్షల్లో ప్యాకేజీలు అందుకుంటోంది.
తాజాగా మరో ఆకర్షణీయమైన ఫోటోషూట్ తో ఈ భామ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి క్రీమ్ కలర్ చీరలో హనీరోజ్ సౌందర్యం మంత్ర ముగ్ధులను చేస్తోంది. ముదురు గులాబీ రంగు బ్లౌజ్ కాంబినేషన్ ఎంతో ఆకట్టుకుంది. ఈ అందమైన చీరకు తగ్గట్టే మ్యాచింగ్ పింక్ చెవిపోగులు ధరించింది. ఆ ముఖంపై చెరిగిపోని అందమైన నవ్వు హనీరోజ్ కి ప్రధాన అస్సెట్ అనడంలో సందేహం లేదు.
ఈ అందం పయనమిలా సాగింది:
హనీ రోజ్ వర్గీస్ (జననం 5 సెప్టెంబర్ 1991) ప్రముఖ మలయాళ నటి. కొన్ని తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలలో కూడా కనిపించింది. 2005 మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్‌తో తొలిసారిగా తెరకు పరిచయమైంది. 2012లో త్రివేండ్రమ్ లాడ్జ్‌లో సంచలన పాత్రతో ఆకట్టుకుంది.
హనీ రోజ్ వర్గీస్ కేరళలోని మూలమట్టంలో సైరో-మలబార్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. మూలమట్టంలోని S.H.E.M ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆమె సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, అలువా నుండి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కలిగి ఉంది.
2005లో 14 ఏళ్ల వయస్సులో తన కెరీర్‌ను ప్రారంభించిన హనీ రోజ్ వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్‌లో నటించింది. ఇందులో మణికుట్టన్ స్నేహితురాలిగా నటించింది. 2007లో తన మొదటి నాన్-మలయాళ ప్రాజెక్ట్ లో నటించింది.మె మొదటి తమిళ చిత్రం రొమాంటిక్ డ్రామా ముధల్ కనవేకి సంతకం చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయం (2008)లో నటించింది. నిజానికి ఆలయం హనీరోజ్ కి తెలుగు అరంగేట్ర చిత్రం. చాలా గ్యాప్ తర్వాత బాలకృష్ణ సరసన అఖండ లాంటి భారీ చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంలో హనీరోజ్ పేరు మార్మోగింది.