అక్కడ ప్రశాంతత వెతుక్కుంటున్న సమంత
By: Tupaki Desk | 12 Nov 2023 6:24 AM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏకంగా దశాబ్దం పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతోన్న అందాల భామ సమంత. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల పరంగా స్పీడ్ తగ్గించింది. అయిన ఈ ఏడాది ఆమె నుంచి రెండు సినిమాలు వచ్చాయి. గత ఏడాది మయోసైటిస్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్న ఈ బ్యూటీ ఇంకా పూర్తిస్థాయిలో ఫిజికల్ గా ఫిట్ కాలేదు.
దానికోసం ఓ వైపు మెడికేషన్ తీసుకుంటూనే మరో వైపు మెంటల్ స్త్రెంత్ పెంచుకునే పనిలో ఉంది. విడాకుల తర్వాత కాస్తా డిప్రెషన్ లోకి వెళ్ళిన సమంత ఆ జ్ఞాపకాలు, శరీరాన్ని వేధించిన అనారోగ్యం కారణంగా మానసికంగా కూడా ఇబ్బందులు పడుతోంది. వీటిని అధికమించడానికి ట్రావెలింగ్ ఎంచుకుంది. ఏడాది పాటు పూర్తిగా సినిమాలకి విరామం ఇచ్చి మానసికంగా స్ట్రాంగ్ అయ్యే పనిలో ఉంది.
దీనికోసం ప్రకృతితో మమేకం అవుతూ, దైవానికి దగ్గరగా ఉంటూ ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తోంది. సద్గురు ఆశ్రమం లో రెండు లో యోగా, మెడిటేషన్ చేసి తన ప్రయాణం ప్రారంభించిన సమంత ఓ వైపు అమెరికాలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరో వైపు వివిధ దేశాలు వెకేషన్స్ కి వెళ్తోంది. తన రెగ్యులర్ యాక్టివిటీస్ కి సంబందించిన ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటుంది.
తాజాగా బూటాన్ రాజధాని థింపులో అక్కడ బౌద్ద టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకుంది. అలాగే సిటీ అందాలని ఆశ్వాదిస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది. అక్కడి ఆద్యాత్మిక సౌందర్యాన్ని తన ఫోటోలలో షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సమంత షేర్ చేసిన ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఆమె ప్రయాణాన్ని అభిమానులు ఆశ్వాదిస్తున్నారు.
అలాగే నెటిజన్లు నుంచి కూడా భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమంత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారి మళ్ళీ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది సమంత నుంచి సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఒక హాలీవుడ్ మూవీ కూడా ఉంది. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కమిటై ఉంది.