Begin typing your search above and press return to search.

తాప్సి బాలీవుడ్ లో నీకు నువ్వే సాటి

గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన తాప్సి పొన్ను బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆమె ఫేమ్ మారిపోయింది.

By:  Tupaki Desk   |   20 Aug 2023 4:48 AM GMT
తాప్సి బాలీవుడ్ లో నీకు నువ్వే సాటి
X

తెలుగులో కమర్షియల్ హీరోయిన్ గా కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన తాప్సి పొన్ను బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆమె ఫేమ్ మారిపోయింది. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఈ బ్యూటీ దూసుకుపోతుంది. సౌత్ లో రాని స్టార్ హీరోయిన్ ఫేమ్ ని బాలీవుడ్ లో ఆశ్వాదిస్తోంది. ఓ వైపు సోలోగా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతోంది.

మరో వైపు షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ తో జతకట్టే అవకాశం సొంతం చేసుకొని లీడ్ హీరోయిన్ గా మారిపోతోంది. గత ఏడాది చివరిగా బ్లర్ మూవీతో తాప్సి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ ఏడాది మూడు సినిమాలు ఆమె నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో తెరకెక్కిన డుంకీ మూవీ ఒకటి కావడం విశేషం.

డుంకీ హిట్ అయితే తాప్సి రేంజ్ మరింత పెరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఓ వైపు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. యూత్ ని తన అందాలతో క్లీన్ బోల్డ్ చేస్తూ తాప్సి చేసే గ్లామర్ షో నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. వైట్ కలర్ ప్యాంట్, బ్లాక్ కలర్ బికినీ లో టాప్ అందాలు నిండుగా చూపిస్తూ అలరిస్తోంది. ప్యాంట్ జిప్ తీసేసి కుర్రాళ్ళకి చెమటలు పట్టింస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేసాకా తాప్సిని ఎలాంటి వారైనా ఫాలో అవ్వాల్సిందే అనేంతలా ఉన్నాయి.

అయితే హిందీలో బిజీ అయిపోయిన తర్వాత తాప్సి తెలుగు సినిమాలని పూర్తిగా పక్కన పెట్టిందని చెప్పొచ్చు. ఒకవేళ ఇక్కడ చేయాల్సి వచ్చిన స్టార్ హీరోలతో అయితే ఛాయస్ లేదు. చిన్న చిన్న సినిమాలలో నటించాలి. కానీ హిందీలో తాను టాప్ స్టార్ గా దూసుకుపోతోంది. అందుకే తెలుగు సినిమాలని సైడ్ చేసినట్లే చెప్పాలి. చివరిగా తెలుగులో ఆమె మిషన్ ఇంపాజిబుల్ అనే కామెడీ థ్రిల్లర్ లో కనిపించింది.