మిలన్లో మిలమిల మెరుపుల బాలిక
ఎంపికల్ని బట్టే ఎవరు ఫ్యాషనిస్టా.. ఎవరు స్టైల్ ఐకన్? అనేది యువతరం అంచనా వేస్తారు.
By: Tupaki Desk | 24 Sep 2023 5:11 AM GMTఎంపికల్ని బట్టే ఎవరు ఫ్యాషనిస్టా.. ఎవరు స్టైల్ ఐకన్? అనేది యువతరం అంచనా వేస్తారు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఆలియాభట్ ని బాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్యాషనిస్టాగా యూత్ గౌరవిస్తున్నారు. దీనికి కారణం ఈ భామ ఇటీవలి ఎంపికలు. మోస్ట్ అవైటెడ్ గూచీ అంకోరా స్ప్రింగ్ -సమ్మర్ 2024 షో కోసం ఫ్యాషన్ రాజధాని మిలన్ లో ఆలియా ఇలా స్పెషల్ లుక్ తో ప్రత్యక్షమైంది. వేదిక వద్ద ఆలియా ప్రకంపనలు చర్చగా మారాయి. గూచీ స్ప్రింగ్-సమ్మర్ కలెక్షన్ నుండి ఎంపిక చేసిన నియాన్ గ్రీన్ టాప్‌ను ధరించిన ఆలియా సింపుల్ డెనిమ్ బెల్ బాటమ్ తో అదరగొట్టింది. ఫ్యాషనిస్టా అని తనను అభిమానులు ఎందుకు పిలుస్తారో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.
అలియా భట్ గూచీకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం చాలా సహజసిద్ధమైనది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఫ్యాషన్ పరంగా తన అభిరుచి అత్యుత్తమమైనదని ప్రతిసారీ ప్రూవ్ అవుతూనే ఉంది. ఆలియా తన చెవి పోగులు, చేతి గడియారం కూడా స్టైల్ స్టేట్ మెంట్ లో భాగం. తనతో ఉన్న స్టైలిష్ బ్లాక్ మినీ పర్సు ఆకర్షణీయంగా ఉంది. బెల్ బాటమ్ కి తగ్గట్టే చెప్పల్స్ ఎంపిక కూడా ఆసక్తిని కలిగించింది.
సోషల్ మీడియాల్లో అలియా మిలన్లో తన ఫోటోషూట్ నుండి ఆకర్షణీయమైన ఫోటోలను షేర్ చేసింది. ``వ్యక్తిగత శైలి కానీ గుచ్చి…గూచీ...అంకోరా గూచీ...సబాటో దే (గ్రీన్ హార్ట్)..`` అన్న వ్యాఖ్యను జోడించింది. అలియా భట్ బాలీవుడ్ లో అగ్ర కథానాయికగానే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలోను ఎదురేలేని రాణి అని నిరూపిస్తోంది. ప్రస్తతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ఇటీవల కుమార్తె రాహాకు జన్మనిచ్చాక ఆలియా సినిమాలకు బిగ్ బ్రేక్ వేసింది. బ్రహ్మాస్త్ర తర్వాత ఇతర ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తదుపరి అయాన్ ముఖర్జీ- రణబీర్ కపూర్ కాంబినేషన్ సీక్వెల్ మూవీ బ్రహ్మాస్త్ర 2లో నటించాల్సి ఉంది. భన్సాలీతోను మరోసారి కలిసి పని చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని ఆలియా ఇంతకుముందు ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్- బ్రహ్మాస్త్ర లాంటి పాన్ ఇండియా హిట్లతో ఆలియా రేంజ్ అమాంతం స్కైని టచ్ చేసింది. తదుపరి తన భర్తతో కలిసి వరుసగా బ్రహ్మాస్త్ర సీక్వెల్ సినిమాల్లో నటించనుంది.