Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎమీజాక్స‌న్ థై ఎలివేష‌న్ సంథింగ్

అమీ జాక్సన్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లను షేర్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   5 Nov 2023 5:07 AM GMT
ఫోటో స్టోరి: ఎమీజాక్స‌న్ థై ఎలివేష‌న్ సంథింగ్
X

అమీ జాక్సన్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లను షేర్ చేస్తోంది. ఈ పోస్టుల‌కు అభిమానులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇటీవ‌ల కొన్ని రాంగ్ రీజ‌న్స్ అమీ జాక్స‌న్ ని తీవ్రంగానే ఇబ్బందిపెట్టాయి. ఇటీవ‌ల‌ ఆమె ముఖకవళికలు ఎలా విభిన్నంగా కనిపిస్తున్నాయో నెటిజన్లు ఆశ్చర్యంతో గమనించకుండా ఉండలేకపోతున్నారు. చాలామంది మారిన ముఖ క‌వ‌లిక‌ల్ని ఐరిష్ నటుడు సిలియన్ మర్ఫీ తో పోల్చారు.

ఇన్ స్టాలో ర‌క‌ర‌కాల‌ ఈవెంట్‌లు.. విహారయాత్రల నుండి ఫోటోలను షేర్ చేయ‌గా వాటిలో ఎమీ జాక్స‌న్ మారిన రూపం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇంత‌కుముందు హాలీవుడ్ న‌టుడు సిసిలియ‌న్ మ‌ర్ఫీలా క‌నిపించ‌డంతో.. ఇది కేవలం మేకప్ మాత్రమేనా లేదా అమీ జాక్సన్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందా అనే చర్చ ప్రారంభమైంది. క్లోజ్-అప్ ఫోటోలలో మెరిసే ఆకుపచ్చని కళ్ళు, ఎత్తైన చెంప ఎముకలు, పొత్తికడుపు ఎలివేష‌న్ తో కనిపించిన ఎమీపై ర‌క‌ర‌కాల కామెంట్లు వెల్లువెత్తాయి. ఆమె ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ కూడా చ‌ర్చ‌గా మారింది. ఎమీ మారిన లుక్‌పై నెటిజన్లు తమ స్పందనను తెలుపుతూ కామెంట్ చేసారు.

ఇప్పుడు మ‌రో లేటెస్ట్ ఫోటోషూట్ ని ఎమీజాక్స‌న్ షేర్ చేసింది. అయితే మునుప‌టితో పోలిస్తే మ‌రీ అంత టూమ‌చ్ గా క‌నిపించక‌పోయినా కానీ, ఎమీజాక్స‌న్ రూపంలో మార్పు స్ప‌ష్టంగా కొట్టొచ్చిన‌ట్ట క‌నిపిస్తోంది. త‌న చిక్స్ మునుప‌టిలా బ‌బ్లీ లుక్స్ క‌నిపించ‌డం లేదు. ఏజ్ ఫ్యాక్ట‌ర్ కూడా బ‌హిర్గ‌త‌మ‌వుతోంది. ఎమీలో హాట్ కంటెంట్ కి కొదవేమీ లేదు. అలా థై స్లిట్ సొగ‌సుల్ని అందంగా ప్రెజెంట్ చేయ‌గ‌ల‌దు. ఒక బిడ్డ త‌ల్లిగా త‌న రూపంలో మార్పును మాత్రం ఎమీ క‌వ‌రప్ చేయ‌లేక‌పోతోంది. తాజాగా బ్లాక్ డిజైన‌ర్ ఫ్రాక్ లుక్ లో క‌నిపించిన ఫోటోలు అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి.

అమీ జాక్సన్ తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించింది. ఆమె మిస్ టీన్ లివర్‌పూల్ .. మిస్ టీన్ గ్రేట్ బ్రిటన్ వంటి పోటీలను గెలుచుకుంది. 2009లో మిస్ టీన్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందింది. 2010లో మిస్ లివర్‌పూల్ కిరీటాన్ని పొందింది. 2010లో విడుదలైన మద్రాసపట్టణం చిత్రంతో క‌థానాయిక‌గా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నటుడు ఆర్యతో అమీ జాక్సన్ కనిపించింది. 2012లోప్రతీక్ బబ్బర్‌తో కలిసి ఏక్ దీవానా థా అనే హిందీ చిత్రంలో నటించింది. దీనికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

2014లో `ఎవడు` చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రామ్ చరణ్- శృతి హాసన్‌లతో క‌లిసి నటించింది. 2012 చిత్రం తాండవం కోసం ఉత్తమ సహాయ నటి తమిళం విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు కూడా ఎంపికైంది. ఈ సినిమాలో విక్రమ్, అనుష్క శెట్టితో పాటు అమీ జాక్సన్ కనిపించింది. CW ఛానెల్‌లో ప్రసారమైన 2017 సిరీస్ సూపర్‌గర్ల్ తొలి హాలీవుడ్ అవ‌కాశం. ఇందులో ఇమ్రా ఆర్డీన్ లేదా సాటర్న్ గర్ల్ పాత్రను పోషించింది.