పింక్ ఫ్రాక్‌లో బార్బీ బొమ్మ
By: Tupaki Desk | 9 Jun 2024 3:59 PM GMTహలీవుడ్ లో బార్బీ ఫ్రాంఛైజీ మిలియన్ల డాలర్ల వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ లైగర్ బ్యూటీ అనన్య పాండే బార్బీ లుక్ కి సోషల్ మీడియాల్లో మిలియన్ల లైక్ లు వచ్చి పడుతున్నాయ్. అనన్య పాండే బి-టౌన్ కొత్త బార్బీ గా అవతరించిందంటూ ప్రశంసలు కురుస్తున్నాయ్. ఈ లుక్ టూమచ్ కాస్ట్ లీ సుమీ! ఈ భామ రూ. 50K కంటే ఖరీదైన గులాబీ రంగు మినీ డ్రెస్‌లో బార్బీని తలపిస్తోంది.
బాలీవుడ్ యంగ్ గాళ్స్‌లో అనన్య పాండే ఒకరు. నటిగా తనవైన అద్భుత ఎంపికలతోనే కాకుండా, ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లోను అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. అనన్య జెన్ Z ఫ్యాషనిష్టాగా నటవారసురాళ్ల నడుమ ఓ వెలుగు వెలుగుతోంది. ఈ ఆదివారం నాడు అనన్య పాండే తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో వెబ్ లో కాకలు పుట్టించింది. పింక్ కలర్ మినీ ఫ్రాక్ ధరించి కిల్లర్ లుక్ తో కట్టి పడేసింది. ఈ లుక్ నిజంగా బార్బీని తలపిస్తోందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అనన్య పాండే ఏరియాలోని షెల్ఫ్‌ల నుండి క్రిస్టల్‌తో అలంకరించబడిన మినీ దుస్తులను ఎంపిక చేసుకుంది. బాడీకాన్ డ్రెస్ నైట్‌క్లబ్ పార్టీకి సరైన లుక్. అనన్య పింక్ ఫ్రాక్ ధరించి మినిమల్ మేకప్ తో ఎంతో అందంగా కనిపించింది. చాలా మంది ఈ లుక్ కి ఫిదా అయిపోవడమే గాక బార్బీ ని చూసినట్టుగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. ఆమె స్టన్నింగ్ లుక్ చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. నువ్వు చాలా అందమైన అమ్మాయివి అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానించారు. మీరు చాలా అందంగా ఉన్నారు అని మరొకరు ప్రశంసించారు. నేను ఆమెతో ప్రేమలో ఉన్నానని అనుకుంటున్నాను! అని మరొక నెటిజన్ కామెంట్ చేసాడు. ఈ అందమైన మినీ దుస్తుల ధర రూ. 54,900.