Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చీరకట్టు లో మేడం సార్‌ మేడం అంతే..!

జబర్దస్త్‌ షో ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయిన యాంకర్‌ అనసూయ, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించడం ద్వారా వెండి తెరపై మెరిసింది.

By:  Tupaki Desk   |   6 July 2024 2:30 PM GMT
పిక్ టాక్ : చీరకట్టు లో మేడం సార్‌ మేడం అంతే..!
X

జబర్దస్త్‌ షో ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయిన యాంకర్‌ అనసూయ, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించడం ద్వారా వెండి తెరపై మెరిసింది. ముఖ్యంగా ఈమె రంగస్థలం సినిమాలో పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి పాపులారిటీ దక్కడంతో టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ నటిగా మారింది.

ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ పడుచు అమ్మాయిలకు పోటీ అన్నట్లుగా అందంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఎరుపు రంగు చీర కట్టు లో నడుము చూపించి చూపించకుండా, సింపుల్‌ అండ్‌ స్వీట్‌ మేకప్‌ తో భలే ఉందే అనిపించే విధంగా అనసూయ కన్నుల విందు చేస్తుంది.

ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అనసూయ మరోసారి అందం విషయంలో వార్తల్లో నిలిచింది. గతంలో జబర్దస్త్‌ చేసే సమయంలో ప్రతి వారం అందాల ఫోటోల షూట్‌ ఫోటోలను షేర్‌ చేసిన అనసూయ ఈ మద్య కాలంలో తగ్గించడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలను షేర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి ఫోటోలను చూస్తూ ఫ్యాన్స్‌ మరియు నెటిజన్స్ మేడం సార్ మేడం అంతే అన్నట్లుగా అల్లు అర్జున్ డైలాగ్‌ ను కామెంట్‌ చేస్తూ అనసూయ పై తమ అభిమానంను ప్రదర్శిస్తున్నారు.

ఈ స్థాయి అందంగా ఉన్న అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ముందు ముందు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించాలని ఫ్యాన్స్ కొందరు కోరుకుంటున్నారు. చాలా మంది టాలీవుడ్‌ హీరోయిన్స్ తో పోల్చితే అనసూయ చాలా అందంగా ఉన్నారు అనేది చాలా మంది అభిప్రాయం.