Begin typing your search above and press return to search.

పొట్టి డ్రెస్సులో దేవియాని.. ఆ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

తెలుగు వెబ్ సిరీస్‌లలో తన అందం, అభినయం, గ్లామర్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవియాని శర్మ

By:  Tupaki Desk   |   16 Nov 2024 12:30 PM GMT
పొట్టి డ్రెస్సులో దేవియాని.. ఆ స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!
X

తెలుగు వెబ్ సిరీస్‌లలో తన అందం, అభినయం, గ్లామర్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవియాని శర్మ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. స్మోకీ గ్రీన్ కలర్ జాకెట్ మినీ డ్రస్‌లో అందాన్ని హైలైట్ చేస్తూ, దేవియాని గ్లామర్ ఫోటోషూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "హాట్నెస్ అనేది పర్ఫెక్ట్ బాడీ గురించి కాదు, అది మీ అంతర్గతమైన ఫైర్‌ను ప్రదర్శించడం గురించి" అని క్యాప్షన్‌తో ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది.

తన కెరీర్‌ను వెబ్ సిరీస్‌లతో ప్రారంభించిన దేవియాని, తొలి ప్రాజెక్ట్ నుంచే టాలెంట్ ను నిరూపించుకుంది. ‘అనగనగ’ వెబ్ సిరీస్ ద్వారా తన ప్రత్యేక నటన తో టాలెంట్ ను చాటుకున్న ఈ అందాల భామ, ఆ తర్వాత ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌లో మోడ్రన్ హౌస్ వైఫ్‌గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అందులో ఆమె నటన, స్టైల్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇంకా ‘సైతాన్’ వంటి సిరీస్‌ల ద్వారా వైలెంట్ పాత్రలను కూడా నేచురల్‌గా ప్రదర్శించి, నెగెటివ్ రోల్స్‌కూ తనదైన మార్కును క్రియేట్ చేసింది.

ఈ పాత్రల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. తాజాగా ఫోటోషూట్‌లో ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బోల్డ్ లుక్స్ నెటిజన్లను ఆశ్చర్యపరచాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ గా మారాయి, ఆమెకు పెద్ద ఎత్తున అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పిక్చర్స్‌తో ఆమె తన యాటిట్యూడ్, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను మరింత ఎలివేట్ చేసింది.



ప్రస్తుతం దేవియాని తెలుగు వెబ్ సిరీస్‌లతో పాటు, టాలీవుడ్‌ పెద్ద అవకాశాల కోసం చూస్తోంది. త్వరలోనే ఆమెకు బిగ్ స్క్రీన్‌పై మెరుపులు మెరిపించే అవకాశాలు వస్తాయని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవియాని గ్లామర్, టాలెంట్ కలయికతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలని భావిస్తోంది. మరి ఆమె అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.