గుండెల్లో గుచ్చుతున్న డింపుల్ అందాలు..!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో డింపుల్ హయతి కూడా ఒకరు. ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది.
By: Tupaki Desk | 11 Sep 2023 3:15 AM GMTటాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో డింపుల్ హయతి కూడా ఒకరు. ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. రవితేజ ఖిలాడీ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ మూవీలో ఆమె అందాలకు అందరూ స్టన్ అయిపోయారు. మొదటి భాగమంతా లంగా వోణీలో పద్దతిగా కనిపించి, సెకండ్ హాఫ్ లో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఈ మూవీ తర్వాత కూడా ఆమెకు హీరోయిన్ గా రెండు, మూడు అవకాశాలు వచ్చాయి.
కానీ, ఎన్ని అవకాశాలు వచ్చినా, ఆమె నటించిన ఏ సినిమా ఇప్పటి వరకు హిట్ కాలేదు.దీంతో, హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే, సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ గ్లామర్ తో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా గ్రీన్ కలర్ లాంగ్ డ్రెస్ లో మెరిసింది. ఆ డ్రెస్ ని హైలెట్ చేసేలా స్టోన్ జ్యూవెలరీ ధరించింది. ఆ జ్యూవెలరీలో ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. ఇక, తన ఎద అందాలు మొత్తం క్లియర్ గా కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. ఈ ఫోటోల్లో ఆమెను చూస్తుంటే ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక, డింపుల్ హీరోయిన్ గా కాకుండా ఐటెం సాంగ్ లోనూ మెరిసింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన జర్ర జర్ర అనే ఐటెం సాంగ్ లో అదరగొట్టింది. ఇక, తన అందం విషయంలో ఆమె ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం చాలా ఎక్కువగా కసరత్తులు చేస్తూ ఉంటుంది. తాను ఫిట్నెస్ కోసం ఎంత కష్టపడుతూ ఉంటుందో, ఫోటోలు, వీడియోలతో తన ఫాలోవర్స్ కి తెలియజేస్తూనే ఉంటుంది.
ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం డింపుల్ ఓ వివాదం లో ఇరుక్కుంది. రీసెంట్గా ఆమె ఉంటున్న ఆపార్ట్‌మెంట్‌లో ఓ ఐపీయస్ ఆఫీసర్‌తో పార్కింగ్ వివాదం నెలకొంది. అది చాలా పెద్ద ఇష్యూగా మారింది. దీనికి ముందు ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామితో తన ఇంట్లో పూజలు చేయించి కూడా డింపుల్ వార్తల్లోకి ఎక్కారు. కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం అయితే, ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.