బ్లాక్ డ్రెస్సింగ్ లో హంస నందిని స్టన్నింగ్!
హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలాలనే కోరికతో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కానీ, ఆమె అనుకున్నట్లుగా హీరోయిన్ గా రాణించలేకపోయింది.
By: Tupaki Desk | 20 Aug 2023 7:49 AM GMTమన చుట్టూ ఎన్ని రంగులు ఉన్నా, నలుపు అందం నలుపుదే. అదే నలుపు దుస్తులను అందాల అపర్సస లాంటి అమ్మాయి ధరిస్తే, దాని అందం మరింత రెట్టింపు అవుతుంది. నటి హంసా నందిని కూడా అదే చేసింది. నలుపు రంగు లెహంగాలో అందాల దేవకన్యలా మెరిసిపోయింది.
హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలాలనే కోరికతో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కానీ, ఆమె అనుకున్నట్లుగా హీరోయిన్ గా రాణించలేకపోయింది. అయితే, ఏంటి? ఐటెం సాంగ్స్, స్పెషల్ రోల్స్ తో గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా అత్తారింటికి దారేది, మిర్చి, లౌక్యం వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో మెరిసింది. ఆ పాటలు బాగా క్లిక్ అయ్యాయి.దీంతో, ఈ బ్యూటీకి ఎక్కువ గుర్తింపు వచ్చింది.
మధ్య, మధ్యలో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో పాత్రలు దక్కించుకుంటోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేసి, ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో మెరిసింది. నలుపు డ్రెస్ లో ఆమె అందాలు మరింత అందంగా ఉన్నాయి. అయితే, లెహంగా పద్దతిగా కాకుండా, కింద స్లైట్ గా కట్ ఇచ్చి, స్టైలిష్ గా కనపడింది.
తన నడుము అందాలను ఎరగా వేయగా, ఫోటోలు ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సూపర్ హాట్ గా ఉన్నారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం హంస నందిని క్యాన్సర్ బారిన పడ్డారు. 2022 ఏడాది ఆరంభంలో తను ఈ మహమ్మారి కోరల్లో చిక్కకున్నట్టు ప్రకటించిన ఆమె.. చాలా బాధను అనుభవించింది. అప్పటి నుంచీ ట్రీట్మెంట్ తీసుకుంటూ.. అప్పడప్పుడు అప్ డేట్ ను అందిస్తూ వచ్చింది. చివరకు క్యాన్సర్ ను జయించింది.
క్యాన్సర్ ని జయించిన తర్వాత ఆమె మరింత ఉత్సాహంగా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తుండటం విశేషం. ప్రస్తుతానికి అయితే, ఆమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.