వారసుడితో ఇలియానా సో క్యూట్ లవ్‌లీ
ఇలియానా డిక్రూజ్ ప్రస్తుతం ఏం చేస్తోంది? అంటే గత కొంతకాలంగా ఈ గోవా భామ తనను తాను మైమరిచి పూర్తిగా తన బిడ్డ కోసమే సమయాన్ని వెచ్చిస్తోందని సోషల్ మీడియా పోస్టింగులు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 3 Sep 2023 7:49 AM GMTఇలియానా డిక్రూజ్ ప్రస్తుతం ఏం చేస్తోంది? అంటే గత కొంతకాలంగా ఈ గోవా భామ తనను తాను మైమరిచి పూర్తిగా తన బిడ్డ కోసమే సమయాన్ని వెచ్చిస్తోందని సోషల్ మీడియా పోస్టింగులు చెబుతున్నాయి. నేటి ఉదయాన్నే ఒక క్యూట్ ఫోటోగ్రాఫ్ ఇన్ స్టాలో ప్రత్యక్షమైంది. తన మగబిడ్డను చూస్తూ తెగ ముచ్చటపోతున్న ఇలియానా ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇలియానా డిక్రూజ్ తన జీవితంలోకి బిడ్డ రాకను ఎంతగానో ఆస్వాధిస్తోంది. ఆగస్ట్ 5 న తనకు కుమారుడు జన్మించగా... ఇన్‌స్టాలో క్యూట్ ఫోటోని షేర్ చేసింది. తన కొడుకు పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ అందమైన మాతృత్వ దశను ఆస్వాధిస్తున్నందున ఇలియానా తన కుమారునితో ఉన్నప్పటి అందమైన ఫోటోని షేర్ చేసింది.
తాజా మోనోక్రోమ్ ఫోటోలో ఇలియానా తన కొడుకును చేతులతో సుతారంగా తాకుతోంది. ఈ ఫోటోలో కుమారుడు డోలన్ ముఖం కనిపించడం లేదు కానీ... ఆ ఫోటోగ్రాఫ్ చూడగానే క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అని అంతా ప్రశంసిస్తున్నారు. ``మార్నింగ్స్ విత్ మై బేబీ`` అని ఈ ఫోటోకి ఇలియానా అందమైన క్యాప్షన్ ఇచ్చింది. ఆ అందమైన క్షణాన్ని ఇలియానా ఎంతో ఆనందంగా ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటోంది.
నిజానికి ఇలియానా తాను గర్భవతిని అవుతానని కలగనలేదని క్లియర్ గా చెప్పింది. అప్పటివరకూ దాచేసిన తన భర్త ఫోటోని కూడా రివీల్ చేసింది. అతడి పేరును కూడా చెప్పింది. గర్భధారణ దశ గురించి ఒక నోట్‌లో ఇలియానా ఇలా పేర్కొంది. ``గర్భిణిగా ఉండటం చాలా అందమైన ఆశీర్వాదం…నేను ఎప్పుడైనా దీన్ని అనుభవించే అదృష్టం కలిగి ఉంటానని నేను అనుకోలేదు కాబట్టి ఈ ప్రయాణంలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాలో ఒక జీవం పెరుగుతోందనేది అనుభూతి చెందడం ఎంత మనోహరంగా ఉంటుందో నేను వర్ణించలేను. చాలా రోజులుగా నేను నా బంప్‌ని చూస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను.. త్వరలో మిమ్మల్ని కలుస్తాను… ఆపై కొన్ని రోజులు చెప్పలేనంత కష్టంగా ఉంటుంది`` అంటూ మురిసిపోయింది.
ఆ తర్వాత జూన్‌లో ఇలియానా చివరకు తన భాగస్వామి ఫోటోను షేర్ చేసి బిడ్డ తండ్రి అని వెల్లడించింది. ఇలియానా తన భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోల కోల్లెజ్‌ను పోస్ట్ చేసి `డేట్ నైట్` అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఇలియానా తన భాగస్వామి మైఖేల్‌ను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలియానా ఈ ఏడాది మే 13న మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. కాగా తాను గర్భం దాల్చిన నాలుగు వారాల ముందు పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియాలో తెలిపింది. అంతవరకూ తన పెళ్లిని రహస్యంగా దాచింది.