పిక్ టాక్: కాజల్ అగర్వాల్ స్పైసీ ట్రీట్..
టాలీవుడ్ చందమామగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్.
By: Tupaki Desk | 17 July 2023 4:24 PM GMTటాలీవుడ్ చందమామగా సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే అందంతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. అలాగే ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె ఇంకా పాతికేళ్ల హీరోయిన్ తరహాలోనే చాలా అందంగా కనిపిస్తోంది.
ఇక ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరాల్సిందే. నేటి తరం యువ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసుకోకుండా కాజల్ అగర్వాల్ గ్లామర్ ట్రీట్ తో అయితే కుర్రాళ్లను ఎంతగానో అట్రాక్ట్ అయితే చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసిన మరికొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో హీటెక్కిస్తున్నాయి.
కొన్ని నెలల క్రితం తీసిన ఫొటోలను షేర్ చేసుకున్న కాజల్ తాజా ఫోటోగ్రాఫ్లో తన అభిమానులను స్టన్ అయ్యేలా చేసింది. ఆమె బటన్స్ లేకుండా ఉన్నట్లు బ్లూ కలర్ బ్లేజర్, ప్యాంట్లో తన చేతులతో టాప్ని పట్టుకుని పోజులిచ్చింది. అమ్మడు ఎక్కడా కూడా ఓవర్ డోస్ లేకుండా చాలా తెలివిగా తన గ్లామర్ తో అయితే మంత్రముగ్దులను చేస్తోంది.
కాజల్ గతంలో కూడా ఎన్నో గ్లామర్స్ ఫోటోలను పోస్ట్ చేసింది. కానీ ఈ లుక్స్ లో మాత్రం ఆమె మరింత అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల కాలంలో తన ఫాలోవర్స్ సంఖ్యను కూడా అమితంగా పెంచేసుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో ఆయనకు మొదటిసారి జోడిగా కాజల్ కనిపించబోతోంది.
ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందట. అలాగే ఆ సినిమాలో శ్రీ లీల కూడా ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అలాగే కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న ఇండియన్ 2 లో కూడా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మరోవైపు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంతవరకు ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలి అని కాజల్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మరి రాబోయే సినిమాలలో ఆమె ఏ విధంగా కనిపిస్తుందో చూడాలి.